కరోనా కి బాగా ఎఫెక్ట్ అయ్యింది హాలీవుడ్ . హాలీవుడ్ సినిమాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ ను నిరాశ పరుస్తూ.. నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయ్యాయి ఫేమస్ హాలీవుడ్ మూవీస్. వీటిలో  జేమ్స్ బాండ్ ,ఫాస్ట్ అఅండ్ ఫ్యూరియస్ ఉన్నాయని బాధపడుతుంటే మరో స్టార్ హీరో సినిమా టాప్ గన్  కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. 

 

హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో టామ్ క్రూజ్ హీరోగా తెరకెక్కుతున్న టాప్ గన్ మెవ్ రిక్ సినిమా కు కరోనా కష్టాలు వచ్చాయి. వరల్డ్ మొత్తం ఎంతో క్యూరియస్ గా వెయిట్ చేస్తున్న ఈ టాప్ గన్ సిరీస్ లోని ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. సమ్మర్ లో రిలీజ్ అని అనౌన్స్ చేసిన ఈ సినిమా ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 23 న రిలీజ్ అవుతోంది. 

 

జేమ్స్ బాండ్ సిరీస్ లో 25 మూవీ నో టైమ్ టూ డై కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ గా చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.దాదాపు 1 వెయ్యి 75 కోట్లతో రూపోందించిన జేమ్స్ బాండ్ 25 మూవీ ఈ ఏప్రిలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాని కరోనా  ఎఫెక్ట్ తో నో టైమ్ టూ డై సినిమా రిలీజ్ ను  ఏకంగా నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ కు పోస్ట్ పోన్‌ చేశారు.

 

సిరీస్ లో 9 వ సినిమా కోసం యాక్షన్ హీరో విన్ డీజిలో తో పాటు ఫేమస్ హాలీవుడ్ స్టార్ జాన్ సీనా కూడా రంగంలోకి దిగాడు. జస్టిన్ లైన్ డైరెక్షన్ లో రూపోంది ది ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9 మూవీ ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ రిలీజ్ అవుతంది అనుకున్నారు అంతా.. కాని కరోనా కాటుతో ఈ సినిమూ కూడా తన డెస్టినీనీ నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేసుకోవడంతో వరల్డ్ ఆడియన్స్ కు నిరాశే ఎదురయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: