ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం ఎంతో అవ‌స‌ర‌మ‌ని సీనియ‌ర్ నటి, హీరోయిన్‌ సుహాసిని తెలుగుప్రేక్ష‌కుల‌కు, ఆమె అభిమానుల‌కు తెలిపారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్ర‌తీ ఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆమె ఉదాహరణల‌తో సహా వివ‌రించారు. చైన్నై నుంచే ఆమె తెలుగు మీడియాతో మాట్లాడారు. మ‌నం చాలా క‌ఠిన‌మైన ప‌రిస్థితుల్లో ఉన్నాం. లండన్ నుంచి వచ్చిన  మా బాబు నందన్. మార్చి 18న లండన్ నుంచి వచ్చాడు.

 

 అయితే మా అబ్బాయిని ఇంత వరకు చూడ‌లేక‌పోయాం. వాడు క్వారంటైన్‌లో ఉన్నాడు. వాళ్ల నాన్నని, అమ్మమ్మ తాతయ్యలను చూడలేదు. వైద్యుల సూచ‌న మేర‌కు మా అబ్బాయి భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మా నాన్నకి 90 సంవత్సరాలు అలాగే మా అమ్మకి 75 సంవత్సరాలు. వాళ్లని ఇంకొంతకాలం ఆనందంగా చూడాలి అనుకుంటే ఈ భౌతిక దూరం తప్పదు అంటూ బాధ‌ను దిగ‌మింగుతూ వివ‌రించింది.   స‌మాజ హితం కోసం ఇలాంటి త్యాగాలు చాలా మంది చేస్తున్నారు. త‌ప్ప‌దు...చేయాల్సిందే అంటూ పేర్కొన్నారు.

 

 ‘‘మనం అందరం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉన్నాం. క‌రోనాను ఇంటి నుంచే ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్ర‌జ‌లెవ‌రూ భయపడవద్దు. ఈ కరోనా వైరస్ మనల్ని ఇబ్బంది పెట్టింది. చిన్నా, పెద్దా అనే తేడాలు లేకుండా ఎవరినీ వదలలేదు. ఇప్పుడు ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండ‌టం ఎంతో శ్రేయ‌స్క‌రం.  ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండండి. మీ ఫ్యామిలీతో కుటుంబ‌స‌భ్యులతో గ‌డిపే స‌మ‌యం వ‌చ్చినందుకు స‌ద్వినియోగం చేసుకోండి.  దయచేసి నా అభ్యర్థనను అందరూ పాటించండి..’’ అని సుహాసిని పేర్కొన్నారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: