ఆవకాయ్ బిర్యానీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అచ్చ తెలుగు హీరోయిన్ బిందు మాధవి... బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు లాంటి చిత్రాలలో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవి ఆమెని స్టార్ హీరోయిన్ లెవెల్ కి తీసుకెళ్లలేదు కదా ఆమెకి టాలీవుడ్ లో అసలు ఏ ఆఫర్ రాకుండా చేసాయి. దాంతో తీవ్ర నిరాశ చెందిన కథానాయకి బిందుమాధవి సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన అందాలను ఆరబోస్తూ చాన్సుల కోసం తహ తహ లాడింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. టచ్ చేసేది ఏమీ లేక తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అడపాదడపా సినిమాలలో నటించడం ఆరంభించింది.


ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో తన హీరోయిన్ స్నేహితులు ఆమె ని తమిళ రియాల్టీ ప్రోగ్రాం 'బిగ్ బాస్-1' కి సెలెక్ట్ అయ్యేందుకు సహాయం చేశారు. ఆ అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించకున్న నటి బిందు మాధవి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. తన అందచందాలతో లక్షల మంది ప్రజల అభిమానుల్ని సంపాదించుకున్న బిందు మాధవి ప్రస్తుతం తన సినీ కెరీర్ ని ఒక గాడిలో పడేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటికే పరిమితమైన బిందుమాధవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ నిర్వహించిన ఈమె తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన నెటిజనులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది.


టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను ఎందుకు రావట్లేదని చెప్పేందుకు తన వద్ద ఏ సమాధానం లేదని చెప్పినా ఆమె... తనకి ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందని చెబుతూనే ఇంకా కమిట్ అవ్వలేదని అంటూ అభిమానులను కన్ఫ్యూషన్ లో పడేసింది. ఒకవేళ తాను తన రిలేషన్షిప్ గురించి బయటకు చెబితే మీడియాలో పెద్ద రచ్చే అవుతుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఆమె ఓ ప్రముఖ హీరోతో లవ్వాయణం నడిపిస్తోందని కానీ ఈ సందర్భంలో ఎవరికీ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుందని సినీ వర్గాల నుండి టాక్ బలంగా వినిపిస్తుంది. మరి తాను అధికారికంగా తన రిలేషన్ షిప్ ని బయట పడుతుందో లేదో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: