భ‌ద్రం బీ కేర్‌ ఫుల్ బ్ర‌ద‌ర్‌ భ‌ర్త‌గ మార‌కు బ్యాచ‌ల‌ర్ అని ఎవ‌రైనా అల‌ర్ట్ చేశారా లేక మ‌రొక‌టో కార‌ణ‌మైతే తెలియ‌దు కాని, టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు ముదురు బెండ‌కాయ‌లుగా మారిపోతున్నారు. వీళ్ళ‌లో కొంద‌రికైతే  న‌ల‌భై త‌న్నుకొచ్చేస్తుంది. అయినా స‌రే స్లో అండ్ స్ట‌డీ వెన్ ద మ్యారేజ్ రేస్ అంటున్నారు. అలాంటి వాళ్ళ‌లో టాప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మ‌రెవ‌రో కాదు ప్ర‌భాస్‌. పెళ్ళెప్పుడు అని అడిగితే బాహుబ‌లి పూర్తి కానివ్వండి అంటూ త‌న‌దైన స్టైల్లో చెప్పేవాడు. ఫ‌స్ట్ పార్ట్ త‌ర్వాత సెకండ్ పార్ట్ అని కేవ‌లం ఎవ్వ‌రూ అడ‌గ‌క ముందే కేవ‌లం ఎక్స్ ప్రెష‌న్స్‌ని బ‌ట్టి చెప్పేవాడు. అన్నీ అయ్యాక ఇంకా ఆల‌స్య‌మేంటి అని ఎవ‌రైనా అడిగితే చాలు వాళ్ళ నోట్లో నుంచి మాట బ‌య‌ట‌కు రాక‌ముందే య‌స్ మీ డ‌వుట్ ఏంటో నాకు తెలుసు పెళ్ళెప్పుడు అనేగా సాహో కానిదే అని అంటున్నాడు. ఇక సాహో కూడా అయిపోయి. ఇప్పుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇక ప్ర‌భాస్ ఇదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ వెళితే...స‌ల్మాన్ ఖాన్ లాగా వ‌య‌సు పెరిగి మీసం కండ‌లు మాత్ర‌మే మిగిలేలా ఉన్నాయి. ఇక ప్ర‌భాస్ నిన్న‌మొన్న పుట్టినోడు కాదు 1978 అక్టోబ‌ర్ 23న పుట్టాడు. ప్ర‌స్తుతం 2020 అంటే అటూ ఇటుగా 40 ఏళ్ళు. మ‌రి దీన్ని బ‌ట్టి చూస్తే త‌న‌కు పెళ్ళి వ‌య‌సు దాటింద‌నే చెప్పాలి. ఇక ఈయ‌న వ‌య‌సు వాళ్ళ‌ను చూస్తే వాళ్ళ‌కు పెళ్ళై పిల్ల‌లు పుట్టేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా రేపోమాపో జ‌రిగేలా ఉన్నాయి. అదేమంటే కెరియ‌ర్ ఫ‌స్ట్ మ్యారేజ్ నెక్స్‌ట్ అంటున్నాడు. 

 

ఆ త‌ర్వాత నితిన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరాధ్య దైవంగా భావించే నితిన్ కి ఇటీవ‌లె షాలిని అనే ఓ బిజినెస్ మ్యాన్ కూతురితో ఎంగేజ్‌మెంట్ అయింది. పెళ్ళి కూడా ఫిక్స్ ఇక రేపోమాపో వివాహం చేసుకోబోతున్నాడు అనుకుంటే స‌డెన్‌గా క‌రోనా క‌ల్లోలం వ‌ల్ల బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత రానా బేసిక్‌గా సినిమా వాళ్ళ‌కి పెళ్ళి చేసుకోవ‌డం క‌న్నా చేసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌నిపిస్తుందేమో.పెళ్ళైతే ఒక‌టే టెస్ట్ అది కాకుండా రోజుకో టెస్ట్ అన్న‌ట్లు ఫీల‌వుతున్నారో ఏమోగాని రానా 35ఏజ్‌కి చేరినా ఇంకా తాను లీడ‌ర్ లాంటి వ‌య‌సులో ఉన్నాను అనుకుంటున్నారో ఏమో మ‌రి. బ‌ల్లాల దేవ‌గా నేష‌న‌ల్ వైజ్ పాపుల‌ర్ అయిన రానాకు త‌గిన వ‌ధువు ఇంత వ‌ర‌కు దొర‌క‌నే లేదు. అస‌లే సంప్ర‌దాయ సినీ కుటుంబానికి చందిన‌వాడు ఇంటిల్లాపాది సినిమాల‌ను అటు కుటుంబాల‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజాగా వెంక‌టేష్ మొద‌టి కూతురు అశ్రుత పెళ్ళి కూడా అయిపోయింది. కాని రానా పెళ్ళి మాత్రం ఇంకా సీరియ‌ల్‌లాగా కొన‌సాగుతూనే ఉంది. త‌ర్వాత మోస్ట్ బ్యాచ‌ల‌ర్ శ‌ర్వానంద్. ఎక్కువ‌గా అన్నీ ఫీల్ గుడ్ మూవీస్ చేస్తుంటాడు. ఇక ఈ హీరోకి ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా బాగా ఎక్కువ‌గానే ఉన్నారు. కానీ ఈ హీరో సినిమా ధ్యాస‌తోటి పెళ్ళంటేనే ఆమ‌డ దూరం జ‌రిగేలా ఉంది. ఈ కాంప్లాన్ బాయ్ పుట్టింది 1985 మార్చి 6న అటూఇటుగా ఈ కుర్రాడికి 35 ఏళ్ళు వ‌చ్చేస్తున్నాయి. 

 

నారా రోహిత్ ఇత‌డి వ‌య‌సు కూడా ఏమి త‌క్కువ కాదు 1984 జులై 8న పుట్టాడు. ఇప్ప‌టికే 35 మ‌రో అయిదారేళ్ళ‌కు 40కి ద‌గ్గ‌రైపోతాడు. ఇంత సినిమా స్టేట‌స్ మంచి ప్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబ‌ట్టి ఈ పాటికే వివాహం జ‌రిగిపోవాలి. కానీ ఇత‌ని పెళ్ళి గురించి మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. నిన్నా మొన్నా రెఢీ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మున్న‌టువంటి బ‌బ్లీ బాయ్ రామ్‌. రామ్‌కి కూడా దాదాపు 30 ఏళ్ళు దాటేశాయి. 1988 మే 15న పుట్టాడు ఇత‌న‌ని పెళ్ళి ఎప్పుడు అని అడ‌గాలంటే ఎవ్వ‌రికీ ధైర్యం చాల‌డం లేద‌ట‌. నా ముందు క్యూలైన్ చూడండి అంటున్నాడ‌ట‌. పోనీ సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ని అడుగుదామంటే అత‌నిదికూడా సేమ్ డైలాగ్ ఒక్క హిట్ ఒక్క‌టంటే ఒక్క‌టి అని ప‌రిత‌పించ‌డంతోనే స‌రిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: