మనుషులందరిలో అతను ఓ వింత జీవి.. అందుకే అతనికి ఓ ప్రత్యేకత ఉంది. అదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని. అలాంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసినా సరే.. చివరికి ఒక మాట మాట్లాడినా సరే అది ఖచ్చితంగా వివాదం అవుతుంది.. అంతటి వివాదాస్పద దర్శకుడు అయన. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు రామ్ గోపాల్ వర్మకు ఒక సంవత్సరం పెరిగింది.. ఇంకా అర్థం కాలేదా? ఈరోజు అతని పుట్టిన రోజు. అందుకే వివాదాస్పద దర్శకుడు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.. అప్పట్లో ఓ 9 సినిమాలకు దర్శకత్వం వహించి హిట్ కొట్టాడు రామ్ గోపాల్ వర్మ.. అతను ఇంకా మంచి సినిమాలు తీసి ఉంటే మంచి స్టార్ దర్శకుడు అయ్యేవాడు.. కానీ ఎం చేస్తాం.. అతను ఆలా అనుకోలేదు.. 

 

అందుకే.. ట్రైలర్, టీజర్ ల తో సినిమా సూపర్ ఉంటుంది అని అందరికి భ్రమ కలిపించి థియేటర్ వచ్చాక ఏదో వేస్ట్ సినిమా రా బాబు.. టీజర్, ట్రైలర్ చూసి అనవసరంగా డబ్బులు, సమయం వేస్ట్ చేసుకున్న అని ప్రేక్షకుడితో అనిపిస్తాడు.. అసలు భయం లేదు.. వ్యవస్ద అంటే లెక్క లేదు.. ఎవడైతే నాకేంటి అని నేను వర్మ.. రామ్ గోపాల్ వర్మ అనేలా అయన ప్రవర్తన ఉంటుంది..

 

ఏ పిచ్చోడు అయినా.. ట్రిపుల్ రైడింగ్ చేసి ఆ ఫోటోలు, వీడియోలు పోలీసులకు పెట్టి వారు సరిగ్గా పని చెయ్యడం లేదు.. నేను తప్పు చేసినా నాకు ఫైన్ వెయ్యలేదు అని.. నన్ను జైల్లో వెయ్యలేదు అనేవారు ఉంటారా? జల్లెడ వేసి వెతికినా అలాంటివాళ్లు ఎక్కడా కనిపించరు.. కానీ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పోలీసులను షాక్ కి ఇచ్చి మరి ఫైన్ వేయించుకుంటాడు.

 

ఒక్క పోలీసులకే కాదు ముఖ్యమంత్రులకు కూడా ఈయన వాళ్ళ చరిత్ర సినిమా తీస్తా అని బెదిరించే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.. కొందరికి అయితే ఈయన చుక్కలు చూపించాడు.. సినిమాలు తీసి ట్రైలర్ తో, టీజర్ తో వారిని ఒక్కసారిగా హడలెత్తించాడు.. అంతెందుకు.. మొన్నటికి మొన్న అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని ట్వీట్ చేశాడు.. కానీ మళ్లీ ఏప్రిల్ ఫూల్ అంటడు.. ఇది అతని నైజం.. అతనికి కాస్త కాదు ఒళ్ళంతా తిక్కే ఉంది.. అందుకే ఎప్పుడూ ఏదో ఒక విమర్శతో వార్తల్లో మునిగి తేలుతుంటాడు. ఏమైతేనేం ఈరోజు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు.. సో అందరూ ఈ వివాదాల 58 ఏళ్ళ ముసలి తాతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేయండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: