కరోనా నేపథ్యంలో ఇప్పుడు కొన్ని దేశాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇందులో ఇండియా, ఫ్రాన్స్, మలేషియా, పనామా, జర్మనీ, ఇజ్రాయెల్, బెల్జియం ,ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెన్యా, న్యూజిలాండ్ సహా తదితర దేశాలున్నాయి.  ఇప్పటి వరకు కరోనా లాక్ డౌన్ చేయడం వల్ల దీని వ్యాప్తికి కాస్త అరికట్టగలుగుతున్నాము. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ బయంకరమైన కరోనా వైరస్ 205 దేశాలకు వ్యాప్తి చెంది నానా బీభత్సం సృష్టిస్తుంది.  కొన్ని దేశాల్లో అయితే మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు.  

 

కరోనా మహమ్మారి ఒక ఖండానికే పరిమితం కాకుండా ప్రపంచంలో అన్నిచోట్లకు వ్యాపించింది. కెన్యా వంటి చిరు దేశాలు కూడా శక్తికి మించి పోరాడుతున్నాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వివరాలు తెలిపారు. అయితే లాక్ డౌన్ ని అక్కడ నియంత్రించడం పోలీసుల వల్ల కావడం లేదని ప్రభుత్వం మసాయ్ తెగవారిని కర్ఫ్యూ సేవలకు రంగంలోకి దింపుతోందని వెల్లడించారు.

 

ఓ సింహాన్ని తన బల్లెంతో చంపలేని వాడ్ని మసాయ్ తెగలో అసలు మనిషిగానే గుర్తించరని, అలాంటి ధైర్యశాలులను కర్ఫ్యూ కోసం మోహరిస్తున్నారని తెలిపారు.  వీరు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు.. ఎవ్వరి మాట వినరు  పెద్ద సంఖ్యలో మసాయ్ యోధులను తీసుకురావాల్సిందిగా వారి నాయకుడ్ని కెన్యా ప్రభుత్వం ఆదేశించిందని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు.  మన దేశంలో కొంత మంది మాత్రం ఇప్పటికీ లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: