యాంకర్ గా బుల్లితెర మీద తన  ప్రదీప్ మాచిరాజు అప్పట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ప్రదీప్ కనిపించాడు, అయితే బుల్లితెర మీద సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న ప్రదీప్ హీరోగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. 

 

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చంద్రబోస్ సాహిత్యం రెండు ఈ పాటకు బాగా కుదిరాయి. అందుకే ఈ ఒక్క పాటతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మున్నా డైరెక్ట్ చేశారు. అసలైతే మార్చి 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పెద్దది. ప్రస్తుతం థియేటర్  లు కూడా నడవని పరిస్థితి కనిపిస్తుంది. 21 రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అందుబాటులో ఉంటే ఓకే కానీ ఇంకా కొనసాగితే మాత్రం థియేటర్ల బంద్ కూడా పొడిగిస్తారు. 

 

ఇదిలాఉంటే మార్చి మూడవ వరం నుండి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల షెడ్యూల్స్ అని మళ్ళీ రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. నాని వి, వైష్ణప్ తేజ్ ఉప్పెన ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ పోటీకి వస్తున్నాయి అయితే వీటితో పోటీపడి ప్రదీప్ నెగ్గుకు రాగడలా అన్న డౌట్ మొదలైంది. మొదటి సినిమాకు ప్రదీప్ కు ఏ హీరోకి రాని కష్టం వచ్చింది. ప్రదీప్ 39 రోజుల్లో ప్రేమించడం ఎప్పుడు రిలీజ్ అవుతుంది. రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. ప్రదీప్ సినిమా రిలీజ్ వాయిదా పడగా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇప్పుడు చెప్పడం కష్టమని తెలుస్తుంది.; ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. స్టార్స్ కు ధీటుగా ప్రదీప్ సినిమాలోని పాత వ్యూస్ సాధించడం విశేషం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: