కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఆగష్టు నెలకు వెళ్ళింది. నాని 'వి' సినిమా పరిస్థితులను బట్టి మే లేదా జూన్ లో రిలీజయ్యే అవకాశాలున్నాయి. 'టక్ జగదీశ్' కూడా సెప్టెంబర్ దాకా ముందుకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య 'లవ్ స్టోరీ' చిత్ర నిర్మాతలు కూడా విడుదల వాయిదా వేసుకోడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

సున్నితమైన ప్రేమ కథా చిత్రాలని తనదైన స్టైల్ లో తెరకెక్కించే శేఖర్ కమ్ముల, 'మజిలీ', 'వెంకీమామ' వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న నాగచైతన్యతో కలిసి మరో లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా మే నెల చివరి వారానికి పోస్ట్ ఫోన్ చేసారు. అయితే ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని జూలైకి వాయిదా వేశారని సమాచారం. ప్రేక్షకులు సైతం ఈ 'లవ్ స్టోరీ' తప్పకుండా చైతూ కెరీర్లో వసూళ్ళ పరంగా కొత్త ఫిగర్స్ నమోదుచేయవచ్చని అనుకుంటున్నారు.

 

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో కలిసి ఆమె నటించడం ఇదే ఫస్ట్ టైం, అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి. అక్కినేని నట వారసుడిగా కెరీర్ ప్రారంభించిన నాగ చైతన్య కొత్త తరహా స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి నాగ చైతన్య ఈ సినిమాతో వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: