ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలకు ఫ్యాన్స్, తో పాటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను రాబట్టడం జరిగింది. 

 

అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ సమయంలో ప్రస్తుతం తమ టీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోందని ఇటీవల స్వయంగా వెల్లడించారు రాజమౌళి. 

 

ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం  ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ సహా పలు ఇతర సినిమాలు సైతం కొన్నాళ్ల వరకు ఇతర దేశాలకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో పాటు, రాబోయే రోజుల్లో మంచి లొకేషన్స్ వెతకడం లేదా అది కుదరకపోతే రామోజీ ఫిలిం సిటీ వంటి వాటిలో భారీ సెట్టింగులు వేయాల్సిన పరిస్థితి తెలెత్తేలా ఉందని అంటున్నారు. ఒకరకంగా దీనితో సినిమా ఖర్చు మరింతగా పెరగనుందని, ఇప్పటినుండే ఆర్ఆర్ఆర్ టీమ్ తలలు పట్టుకుంటోందట. అయితే ఈ పరిస్థితి కేవలం ఆర్ఆర్ఆర్ కే కాదని, ఇప్పటికే విదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ కూడా ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదని, మరి ఈ భారం రాబోయే రోజుల్లో నిర్మాతలు ఎంతవరకు భరించగలరో, తద్వారా ఆ ప్రభావం ప్రేక్షకుల పై ఏవిధంగా, ఏరూపంలో పడుతుందో తలుచుకుంటుంటే కొంత ఆందోళనగా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: