ధోనీకి హెలికాప్టర్ షాట్స్ కొట్టడం నేర్పాలా.. బుమ్రాకు యార్కర్లు విరసడం నేర్పించాలా.. అలాగే రణ్ బీర్ కపూర్ కు ఫ్లర్టింగ్ లో పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు అంటోంది బాలీవుడ్. అసలు ఈ హీరో స్కూల్ లో వేసిన వేషాలు తెలిస్తే మన్మథుడు కూడా ముక్కున వేలేసుకోవాలని స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఇంతకీ స్కూల్ ఏజ్ నుంచే రణ్ బీర్ స్టార్ట్ చేసిన వ్యవహరాలేంటో తెలుసా.. 


రణ్ బీర్ కపూర్ కు బాలీవుడ్ లో ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. ఈ హీరో కాన్సన్ ట్రేట్ చేస్తే చాలు ఎంత పెద్ద హీరోయిన్ అయినా పడిపోతుందని చెబుతుంటారు. అసలు హీరోయిన్లతో రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఈ హీరోకు ఉన్న ట్రాక్ రికార్డ్ తో సంజయ్ దత్ మాత్రమే పోటీ పడగలడని టాక్ ఉంది. కానీ ఇప్పుడు బీటౌన్ వర్గాల్లో వినిపిస్తోన్న మాటలు చూస్తే, మన్మథుడు కూడా ఈడు మాములోడు కాదని కిరీటం తగిలిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

రణ్ బీర్ కపూర్ ఈ డికేడ్ లో టాప్ అనిపించుకున్న హీరోయిన్లందరిలో లవ్ ట్రాకులు నడిపించాడు. దీపిక పదుకొనేతో మొదట లవ్ ట్రాక్ మెయింటైన్ చేసిన రణ్ బీర్, ఆ  తర్వాత కత్రీనా కైఫ్ తో ఎఁగేజ్ మెంట్ వరకు వెళ్లాడు. కానీ ఈ రెండు ప్రేమలకు మధ్యలోనే శుభం కార్డు పడింది. ఈ బ్రేకప్స్ తర్వాత ఆలియా భట్ ను లవ్ లో పడేశాడు. ఈ ఏడాది డిసెంబర్ లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. 

 

రణ్ బీర్ కపూర్ హీరో అయ్యాక ఎన్ని ట్రాక్స్ నడిపించాడో, ఇండస్ట్రీకి రాకముందు అన్ని వేషాలు వేశాడట. రణ్ బీర్ సకెంట్ క్లాస్ లో ఉన్నప్పుడు టీచర్ కాళ్లు చూసేందుకు బెంచీ కింద కూర్చునే వాడట. దీనిపై ఆ మేడమ్ కపూర్ ఫ్యామిలీకి కంప్లైంట్ కూడా చేసిందని.. ఇంట్లో వాళ్లు కూడా మందలించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రణ్ బీర్. దీంతో పువ్వు పుట్టగానే పరిమళించినట్టు.. రణ్ బీర్ కూడా చిన్నప్పటి నుంచే ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: