సహనానికి హద్దుంటుంది. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగినా, రాసినా.. ఇలాగే  పబ్లిక్ గా పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుందని తమ మీద ట్రోల్ చేస్తున్న వాళ్లకి క్లాస్ పీకుతున్నారు సెలబ్రిటీలు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న వాళ్లకి హెల్ప్ చెయ్యడానికి  సెలబ్రిటీలు అందరూ ముందుకొస్తుంటే .. షారూఖ్ ఖాన్ ఇంకా చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని  సోషల్ మీడియాలో తెగ గోల చేశారు ట్రోలర్స్. వీళ్లందరి నోరు మూయించడానికి లేటెస్ట్ గా షారూఖ్.. తను ఏ రకమైన సహాయాన్ని అందించాడో డీటెయిల్డ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

బాలీవుడ్ తనను ముద్దుగా పిలుచుకునే కింగ్ ఖాన్  కి యాప్ట్ అయ్యేలా కింగ్ లా .. 7 డిఫరెంట్ వేస్ లో తనసహాయాన్ని అందించాడు షారూఖ్. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి,  పి.ఎమ్ రిలీఫ్ ఫండ్ కి, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫండ్ కి, డొనేట్ చేశాడు. అంతేకాదు నెలరోజుల పాటు 10 వేలమందికి 3 లక్షల మీల్ కిట్స్ , శానిటైజర్స్, తో పాటు రోటీ ఫౌండేషన్, యాసిడ్ ఎటాక్ ఫౌండేషన్ ..ఇలా రకరకాలుగా పెద్ద ఎత్తున సహాయాన్ని అనౌన్స్ చేశాడు. కానీ ఎక్కడా అందరిలా తనసహాయాన్ని డబ్బుతో ముడిపెట్టలేదు. తను చేసిన హెల్ప్ విలువ కోట్లు విలువ చేసేదైనా.. ఎంత ఖర్చన్నది మాత్రం చెప్పకుండా జస్ట్.. తను చేస్తున్న సహాయాన్ని మాత్రమే పబ్లిక్ గా అనౌన్స్‌ చేశాడు . అందుకే ప్రధాని మోడీ కూడా మనసున్న మారాజు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు షారూఖ్ ఖాన్‌కి.


 
మొన్నటికి మొన్న అందరికీ పెద్ద , దాదాపు 80 ఏళ్లొస్తున్నా.. ఇంకా కోట్లు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. పోయే వాడికి ఎందుకు అంత డబ్బు..? కరోనా ఆపదలో ఉన్నవాళ్లకు సహాయం చెయ్యొచ్చు  కదా.. అంటూ అమితాబ్ బచ్చన్ మీద  నోటికొచ్చినట్టు పోస్టులు పెట్టారు ట్రోలర్స్ . సోషల్ ఇంట్రస్ట్ విషయాల్లో ఎప్పుడూ ముందుండే అమితాబ్.. వీళ్లందరి నోళ్లు ఒక్కకవిత తో మూయించేశారు. అనేవాళ్లని అననీ.. పని పాటా లేని వాళ్లకి అదే పని. నిజంగా పనిలేదు కాబట్టే పనిచేసేవాళ్లని అంటున్నారు. వాళ్లకే పనిఉంటే .. ఇలాంటి పనికి మాలిన పనులు చెయ్యరుగా అంటూ.. సెల్ఫీతో  ఒక చిన్న కవిత ని పోస్ట్ చేశారు అమితాబ్.

మరింత సమాచారం తెలుసుకోండి: