కరోనా వైరస్ దెబ్బకు సినీ పరిశ్రమ ఇప్పుడు నరకం చూస్తుంది. ఎప్పుడూ కూడా వేలాది మంది కార్మికులతో పదుల సంఖ్యలో సినిమాలను తీసే వారు నిర్మాతలు. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరూ కూడా బయటకు రావడానికి లేదు సినిమా చూసే వాళ్ళు లేరు. ఆన్లైన్ లో సినిమాలకు పరిమితం అవుతున్నారు. వీకెండ్ వచ్చింది అంటే చాలు చాలా మంది సినిమాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. వారం అంతా కష్టం చేసి... 

 

ఆ రోజున కుటుంబం తో కలిసి ఒక సినిమా చూడటం అనేది మనం ఎక్కువగా చూసే వాళ్ళం. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అది లేకుండా పోయింది జనాలకు. దీనితో ఇప్పుడు సినిమాలో చాలా మంది నిర్మాతలు దివాలా తీసే స్థితికి వెళ్ళిపోయారు. ఎన్ని విధాలుగా కరోనా కట్టడి చేస్తున్నా సరే అది ఇప్పట్లో మన మాట వినే పరిస్థితి కనపడటం లేదు. వేలాది మంది ఇప్పటికే దాని కారణంగా రోడ్డున పడ్డారు. 

 

మన ప్రభుత్వాలకు సినిమా నుంచి ఆదాయం భారీగా వస్తుంది. వేలాది మంది కార్మికులు హాయిగా బ్రతికే పరిస్థితి ఉంటుంది. నిత్యం ఏదోక పనితో చాలా మంది రోజులు నెట్టుకొస్తూ ఉంటారు. కాని కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. దీనితో నిర్మాతలు కూడా రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత కొంత మంది నిర్మాతలు ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఉన్నారు అనేది అర్ధమవుతుంది. మరి ఎప్పటికి ఈ పరిస్థితి దారిలోకి వస్తుందో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: