ఇప్పుడు సినిమాకు కష్ట కాలం నడుస్తుంది అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా మంది సినిమా షూటింగ్ లు లేక నానా అవస్థలు పడుతున్నారు. పెట్టుబడులు పెట్టిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సినిమాను నమ్ముకుని బ్రతికే వారి పరిస్థితి బయటకు చెప్పడానికి లేకుండా పోయింది. కరోనా అనేది చుక్కలు చూపిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు చేతుల్లో డబ్బులు ఆడక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఇక కొంత మంది ఇప్పుడు అప్పులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఈ తరుణంలో కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. వెబ్ సీరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ చెయ్యాలని భావిస్తున్నారు. కొంచెం పెట్టుబడి పెట్టి ఇంట్లో నుంచి బయటకు రాకుండా షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది చేతులు ఆడతాయి అనే భావనలో ఉన్నారు. నిర్మాతలు కూడా ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలతో చేసే ఆలోచనలో ఉన్నారు. 

 

రెండు మూడు లక్షల పెట్టుబడి పెడితే అయిపోతుంది. ఇక హీరోల స్థాయిని బట్టి పెట్టుబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళను అడిగి తమ పరిస్థితి చెప్పి సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఎక్కువ మంది లేకుండా చూసి సినిమాలను తీసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మన ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. యుట్యూబ్ లో కూడా షూటింగ్ లు ఆగిపోయాయి. దీనితో ఇప్పుడు ఈ బాటలో ముందుకి వెళ్ళాలి అని భావిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: