సినిమా టికెట్ ధరలను పెంచే అవకాశముందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సినిమా ఇప్పుడు కష్టాలు పడుతున్న నేపధ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్మాతలకు అర్ధం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ఇప్పట్లో ఏ సినిమా కూడా ముందుకి వెళ్ళే అవకాశం దాదాపుగా లేదు. చాలా సినిమాలు వచ్చే ఏడాది విడుదల కావడం కూడా చాలా కష్టం. అగ్ర హీరోల సినిమాలకు కూడా దిక్కు లేదు. 

 

పెద్ద పెద్ద సినిమాలకు బడ్జెట్ పెట్టిన నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు టికెట్ ధరలను పెంచే విధంగా ప్రభుత్వాలను కోరే అవకాశాలు కనపడుతున్నాయి. కనీసం టికెట్ కి పది రూపాయల వరకు అయినా పెంచాలని ప్రభుత్వాలను నిర్మాతలు కోరే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అలా అయితేనే నష్టాల నుంచి బయటకు రావడం అనేది సాధ్యం అవుతుంది. లేకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం. 

 

భవిష్యత్తులో సినిమాలు విడుదల కావాలి అంటే మాత్రం ఇప్పుడు నిర్మాత డీలా పడకూడదు. అందుకే ఇప్పుడు కీలక నగరాలలో పట్టణ ప్రాంతాల్లో టికెట్ ధరలను పెంచే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది నిర్మాతలు ఇప్పటికే ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. అది లేకపోతే మాత్రం తమ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఇప్పుడు నిర్మాతలు ప్రభుత్వం ముందు చెప్తున్నారు. ఏడాది రెండేళ్ళ పాటు సినిమాలు లేకపోతే మాత్రం పరిస్థితి చాలా చండాలం గా ఉంటుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలు అందరూ కూడా ధరలు పెంచే విషయం లో పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: