టాలీవుడ్ లో 80వ దశకంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు మురళీ మోహన్.  తర్వాత క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ వచ్చారు. టీడీపీలో కీలక వ్యక్తిగా మారి ఎంపిగా కొనసాగారు.   నటుడిగానే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మురళీమోహన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు.  నేను ఏలూరులోని కాలేజ్ లో చదువుకున్నాను. మొదటి నుంచి కూడా వ్యాపార వ్యవహారాలపైనే దృష్టి ఉండేది. అందువలన చదువు అంతటితో ఆగిపోయింది. చదువు ఆపేశాక విజయవాడలో నేను ఓ బిజినెస్ ను మొదలుపెట్టాను.

 

 అయితే నేను చదువుకున్న కాలేజీలో  హీరో కృష్ణ, క్రాంతి కుమార్ లు చదువుకున్నారు. కాలేజ్ లో నేను సరదాగా నాటకాలు వేసేవాడిననే విషయం క్రాంతికుమార్ కి తెలుసు. ఆయన చెన్నై వెళ్లి 'శారద' సినిమాకి నిర్మాతగా మారాడు. అట్లూరి పూర్ణచంద్రరావు గారు 'జగమే మాయ' సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో విలన్ గా గిరిబాబు చేశారు. ఆ మూవీ తర్వాత నేను ఒక సంవత్సరం పాటు ఖాలీగా ఉండాల్సి వచ్చింది.  ఆ తర్వాత ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు దాసరి నారాయణ రావు నన్ను చేరదీశారు.. నాకు వరుసగా తన సినిమాల్లో చాన్స్ ఇచ్చి ప్రోత్సహించారు.

 

 అప్పట్లో నా సినిమా ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యేది. నేను అలా వేగంగా సినిమాలు చేయడానికీ, వచ్చిన అవకాశాలను వదులుకోకపోవడానికి ఒక కారణం వుంది. నేను సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాను. అప్పటికే నాకన్నా పెద్ద హీరోలు మంచి పొజీషన్లో ఉన్నారు.. అలాంటి వారి కాంపిటీషన్ తట్టుకొని వచ్చిన ఛాన్సులు సద్వినియోగం చేసుకున్నాను అన్నారు. అదృష్టం బాగుండి నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాయి. రోజుకు రెండు షిఫ్టులు చేస్తూ వెళ్లేవాడిని. హీరోగా నిలదొక్కుకున్న తరువాత, కథల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వచ్చాను  అని చెప్పుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: