ప్రస్తుతం మన దేశంలో గడచిన కొద్దిరోజులతో పోలిస్తే కరోనా మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందుతోంది. అయితే దీనిని పూర్తిగా నిరోధించడానికి ఇప్పటికే మన దేశంతో పాటు పలు ఇతర దేశాలు కూడా తమ ప్రజలను కొన్నాళ్ల పాటు ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు అందరూ కూడా కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, తప్పకుండా సోషల్ డిస్టెన్సింగ్ తూచా తప్పకండా పాటిస్తే, రాబోయే అతి కొద్దిరోజుల్లోనే ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమికొట్టవచ్చని మన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 

 

ఇక ఒక్కసారిగా ఎన్నో రోజుల నుండి లాకౌట్ జరుగుతుండడంతో అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, కంపెనీలు,వ్యాపార సముదాయాలు అన్ని పూర్తిగా మూతపడడంతో పేద, దిగువ తరగతుల వారికి పనులు లేక, తినడానికి తిండి కూడా లేక ఆకలితో అలమటించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే ఇది గ్రహించిన కేంద్రం తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత రేషన్ తో పాట్లు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా ప్రకటించడం జరిగింది. వాటితో పాటు మేము కూడా ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలకు పూర్తిగా అండగా ఉంటాం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించారు. 

 

ఇక ఇటీవల మన సినిమా పరిశ్రమ నుండి కూడా పలువురు సహృదయంతో విరాళాలు అందివ్వగా, నేడు కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు, తన కుమారుడు విష్ణు తో కలిసి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి పేద ప్రజలకు ఈ లాకౌట్ ముగిసేవరకు, వారికి రెండు పూటలా భోజనంతో పాటు ప్రతి పల్లెకు రోజుకు 8 టన్నులు చొప్పున కూరగాయలను కూడా అందించడానికి సిద్ధం అయ్యారు. కాసేపటి క్రితం ఈ వార్త బయటకు రావడంతో పలువురు ప్రముఖులు, ప్రజలు మంచు మోహన్ బాబు గారు, నిజంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని మరొక్కసారి నిరూపించుకున్నారు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: