మెగాస్టార్ చిరంజీవి సహాయం చేయడంలోనూ మెగాస్టారే అని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తనను ఆరాధిస్తున్న అభిమానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ఆయన గొప్ప మనసు గురించి ఎన్నో సందర్భాలలో నిరూపితమైంది కూడా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన వంతుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసాడు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఈ ఛారిటీకి తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా అందజేసి ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు.  ఈ ఛారిటీకి నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ సహా ప్రతి ఒక్క హీరో తమ వంతుగా ఆర్ధిక సాయం అందించారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా వారి ఆకలి తీర్చడానికి ఇప్పటికే వారికి అందించాల్సిన సాయాన్ని మొదలుపెట్టేసారు. 

 

గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే స్పందించారు. తన అభిమాని యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్ వైద్యుడితో చెక్ చేయించి ఆమె అనారోగ్యానికి కారణాలను తెలుసుకొన్నారు. వైద్య చికిత్స అత్యవసరమని వైద్యులు సూచించడంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు హైదరాబాద్‌లో సదరు మహిళ అభిమాని నాగలక్ష్మికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట. మొత్తంగా చిరంజీవి తనను ఎంతో అమితంగా ఇష్టపడే అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ద తీసుకోవడం చూసి అందరు మెగాస్టార్‌ను ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సేవాగుణంలో కూడా మెగాస్టార్ మెగాస్టారే అనిపించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: