ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా... కరోనా... రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ కరోనా కారణంతో అన్ని రంగాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంపై ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాము కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలతో పాటు సినీ రంగంలో కూడా బాగా పడిందనే చెప్పాలి. 

 

ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలు షూటింగ్ ముగించుకొని రిలీజ్ కి రెడీ అయ్యాయి. రిలీజ్ అవ్వాల్సిన అన్ని సినిమాలు కూడా ఆగిపోయాయని చెప్పాలి. ఇక సినీ రంగంపై ఆధారపడి కార్మికుల కోసం ఇటీవల చారిటీ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడంతో కొంచెం ఊరట లభించిందనే చెప్పాలి. ఇది అంతా ఇలా ఉండగా మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల దర్శకుల పారితోషకం పై బాగా ప్రభావం ఉంటుందని అంచనా చాలా మంది ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

 


అయితే ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత కరోనా ఎఫెక్ట్ తగ్గినా కూడా ప్రజలు తమ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని అంచనాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కరోనా భయం పోయినా కూడా కొన్ని రోజుల పాటు థియేటర్లకు దూరంగా ఉండే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక కరోనా ప్రభావం సినిమాల పై ఎక్కువగా ఉంటే ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రముఖుల అందరికీ రెమ్యూనరేషన్ తగ్గే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మళ్లీ తిరిగి మాములు పరిస్థితులు అంత సెట్ అయ్యే సరికి చాలా సమయం పడుతుందని సినీ వర్గాల వారు అంచనాలు వేస్తున్నాయి. ఏది ఏమైనా సరే కరోనా ప్రభావం మరికొన్ని రోజులు సినీ రంగంపై ఉంటుందన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: