అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎలాగో తాత అల్లు రామలింగయ్య నుంచి నేర్చుకున్నాడు. అల్లు వారి ఇంట నటనా వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తు వస్తున్నాడు. 1950 దశకంలో పుట్టిల్లు సినిమా ద్వారా అల్లు రామలింగయ్య లాంటి వజ్రం తెలుసు సినీ సీమకు దొరికింది. ఆ తరువాత అదే వంశం నుంచి 2002లో అల్లు అర్జున్ హీరోగా మూడవ తరంలో నటనలో తొలి అడుగులు వేశాడు.

 

పద్దెనిమిదేళ్ళ అల్లు అర్జున్ ప్రస్థానంలో 18 సినిమాలు మాత్రమే చేశాడు. కానీ కచ్చితమైన సక్సెస్ రేటుని సొంతం చేసుకున్నాడు. డ్యాన్సింగ్ డాల్ గా అల్లు అర్జున్ బాలీవుడ్ నుంచి కూడా కితాబులు అందుకున్నాడు. ఇలా లేటెస్ట్ గా అల వైకుంఠపురంలో సినిమాలో అర్జున్ తనదైన నటనతో మరో మెట్టు ఎక్కాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి బన్నీ ఖాతాలో మరో కీర్తి కిరీటంగా నిలిచింది.

 

ఇదిలా ఉండగా అల్లు అర్జున ఇపుడు సుకుమార్ తో కొత్త మూవీకి రెడీ అవుతున్నాడు. ఇందులో అర్జున్ చిత్తూరు జిల్లా  యాస మాట్లాడుతాడుట‌. ఆ మూవీలో ఆయన ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో పక్కా మాస్ గా  కనిపిస్తాడు. ఈ మూవీ కోసం చిత్తూరు జిల్లా రాయలసీమ యాసను అల్లు అర్జున్ నేర్చుకుంటున్నాడుట. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో అల్లు అర్జున్ ఈ విధంగా తన నటనకు మెరుగులు దిద్దుకోవడం అంటే అంతకంటే అతని అంకిత భావానికి వేరే చెప్పాల్సినది లేదు

 

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పుట్టిన రోజు పుట్టిన రోజు నేడు. ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకుని అల్లు వారింట మరిన్ని కీర్తి చంద్రికలు వెదజల్లాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: