టాలీవుడ్ లో వరుసగా బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా  పరిచయం అవుతున్నారు.   మూడు సంవత్సరాల క్రితం ‘చెలియా’ అంటూ పలుకరించి తెలుగు ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచింది అదితీరావు హైదరీ.  అందమైన ఆకృతే కాదు, మంచి నటన కూడా ఆమె సొంతం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా 'వి' సినిమా రూపొందింది. అదితీరావు హైదరీ - నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.  నటించిన సినిమాలు కొన్నే అయినా.. పేరు మాత్రం బాగా పాపులర్ అయ్యింది.  

 

 

టాలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తుంది.  వాస్తవానికి 'వి' సినిమా మార్చి 25 న రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  షూటింగ్, మూవీ రిలీజ్ లు అన్నీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.  దాంతో చాలా సినిమాలు రిలీజ్ టైమ్ మర్చుకుంటున్నాయి.. మరికొన్ని కరోనా ఇబ్బందులు పూర్తిగా సమసిపోయిన తర్వాత రిలీజ్ ప్లాన్లు చేస్తున్నారు.  ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఈ అంశమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

 

ఈ నేపథ్యంలో అదితీరావు పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందనీ, ఆ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి.  ఈ మద్య చాలా మంది సినీ నటులు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.  నెగిటీవ్ షేడ్స్ లో నటించడానికి మరింత ఇష్టపడుతున్నారు. ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'సమ్మోహనం' కూడా హిట్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: