యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రెండో సారి జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ ఫలితాన్నిచవిచూసింది. ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు కానీ తెలుగులో వచ్చిన ఫలితాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
 
ఇక డియర్ కామ్రేడ్ ను హిందీలోకి డబ్ చేసి ఇటీవల యు ట్యూబ్ లో విడుదలచేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఈరోజుతో ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్ ను చేరుకుంది. అంతేకాదు1.3 మిలియన్ లైకులను రాబట్టి అత్యధిక లైకులను రాబట్టిన హిందీ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. 
 
ఇక ఈ చిత్రం తరువాత విజయ్ ఈఏడాది ఫిబ్రవరి లో వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులముందుకు రాగసినిమా కూడా భారీ డిజాస్టర్ ను నమోదు చేసింది. ప్రస్తుతం విజయ్ ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు. ఈచిత్రంతో విజయ్ ,బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ద్విభాషా చిత్రం గా తెరకెక్కుతున్న ఫైటర్ లో విజయ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనుండగా అతనికి జోడిగా అనన్య పాండే నటిస్తుంది. వీరితోపాటు బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ,సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి ,పూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: