ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర నటుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ రాజా రవితేజ ఇద్దరూ కూడా మంచి పేరు, క్రేజ్ ఉన్నవారే. అయితే రవితేజ కొన్నాళ్ళు పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి ఆపై హీరోగా మారి మంచి పేరు దక్కించుకోగా, అతి తక్కువ సినిమాలతోనే మంచి విజయాలు అందుకుని స్టార్ హీరోగా పేరు సంపాదించిన బన్నీకి పలు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సినిమా పరిశ్రమ అంటేనే ఒకింత సెంటిమెంట్స్ కి పుట్టినిల్లు అని చెప్పాలి, ఇక్కడ ఏదైనా సినిమా హిట్ కొడితే ఫలానా సెంటిమెంట్ వల్లనే హిట్ కొట్టిందని, అదే ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే, ఫలానా సెంటిమెంట్ వర్కౌట్ కాక ఫ్లాప్ అయిందని మాట్లాడుకునే వారు మరీ ఎక్కువగా లేనప్పటికీ, కొందరు మాత్రం ఉన్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
 
మరి ప్రస్తుతం ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, రేపు తన 36వ బర్త్ డే ని జరుపుకోనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం రిలీజ్ కానున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ పుష్ప అని నిర్ణయించడం జరిగిందని, ఇప్పటికే నిన్నటి నుండి ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 
 
 
అయితే అదే కనుక నిజం అయితే ఆ సినిమా ఆడదేమో అంటూ కొందరు ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇటీవల రవితేజ, రాశి ఖన్నా కలిసి నటించిన టచ్ చేసి చూడు సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప కావడం, అలానే ఆమె పై ఆ పేరుతో ఏకంగా ఒక పాట పెట్టడం జరిగింది. అయితే అప్పట్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక ఆ విధంగా పుష్ప  పేరుని ఏకంగా బన్నీ సినిమాకు పెడుతున్నారంటే కొంతవరకు ఆ పేరు వలన సినిమాకు నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అంటున్నారు. కాగా ఇటువంటివి నమ్మలేం అని, ఎందుకంటే సినిమాలో ఆకట్టుకునే కథ, కథనాలు ఉంటే ఈ మూఢ నమ్మకాలు వర్కౌట్ కావని మరికొందరు బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: