బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'అమ్మ' బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ని తెరకెక్కిస్తున్నారు. 'తలైవి' అన్న టైటిల్ తో ఈ సినిమాని కే ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కంగనా లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక జయలలిత జీవితంలోని ప్రధాన ఘట్టాలైన అన్ని అంశాలు ఈ సినిమాలో చూపిస్తారట. పదహారేళ్ల వయసు నుండి అరవై ఏళ్ళ వయసు వరకూ మొత్తం నాలుగు గెటప్ లలో కంగనా అమ్మ పాత్రలో కనిపించనుందని సమాచారం.

 

ఇక రీసెంట్ గా ఈ సినిమా గురించి కంగనా ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. నేను జయలలిత గారిలా అందగత్తెని కాదంటూనే ఆమెలా గొప్పగా నటించడం కూడా సాధ్య పడనప్పటికి ఎలాగైనా కొంతవరకైనా ప్రేక్షకులను తృప్తి పరచే విధంగా కష్టపడి నటించడానికి ప్రయత్నిస్తున్నాని తెలిపింది. వాస్తవంగా కంగనా ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు చేయకపోవడం ఇదే మొదటిసారి కావడం ఇప్పుడు సంచలనం అవుతోంది. 

 

ఇక తెలుగు తమిళ హిందీ బాషలలో రూపొందుతున్న ఈ సినిమాపై కన్నడ మలయాళం ఇండస్ట్రీలలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఒకరకంగా చూస్తే పాన్ ఇండియా సినిమాగా రెడీ చేస్తున్నారట. దాంతో ఈ సినిమా మీద వంద కోట్లు పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి మొత్తం వసూలవడం అంత పెద్ద కష్ఠమేమి కాదని చిత్ర యూనిట్ భాగా నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి 100 కోట్లు అంటే కాస్త ఆలోచించాల్సిందే అన్న మాట కూడా గట్టిగా వినిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: