స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా.. మెగా హీరోగా గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో అతన్ని చూసిన చాలామంది ఇతను హీరో ఏంటి అనుకున్నారు. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో డెబ్యూ మూవీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఒక్కో సినిమాకు కష్టపడుతూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. గంగోత్రి తర్వాత తన సెకండ్ సినిమా ఆర్య సినిమాకే తన స్టైల్ మార్చేశాడు అల్లు అర్జున్. 

 

ఆ తర్వాత బన్ని, హ్యాపీ సినిమాలతో తన స్టైల్ ను అందరికి అలవాటు చేశాడు. దేశముదురు సినిమా అల్లు అర్జున్ ను మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసింది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవడమే కాకుండా అల్లు అర్జున్ కు ఒక స్టార్డం తెచ్చిపెట్టింది. ఎంచుకున్న పాత్ర కోసం ఎలాంటి కష్టమైనా భరించి ఆ పాత్రకు న్యాయం చేయడంలో బన్ని ఎప్పుడు ముందుంటాడు. 

 

మెగా ప్రొడ్యూసర్ తనయుడిగా తాను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అనుకునే వారు లేకపోలేదు. ప్రతి సినిమా కథ దగ్గర నుండి తన లుక్,యాక్షన్, డ్యాన్స్, సాంగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు అల్లు అర్జున్. నటుడిగా సినిమా సినిమాకు పరిణితి పొందుతూ వచ్చిన బన్ని రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు సూపర్ క్రేజ్ తెచ్చాడు. ఆ సినిమాలో బన్ని ఉండటం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.

 

ఇక అల వైకుంఠపురములో బంటు పాత్రలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అందరిని మెప్పించింది. గంగోత్రి టైం లో ఇతను హీరో ఏంటో అనుకున్న వారిని కూడా హీరో అంటే ఇతనే అనిపించుకునేలా చేసుకున్నాడు అల్లు అర్జున్.. ఏ పనినైనా కష్టపడి చేసుకుంటూ వెళ్తే రావాల్సిన ఫలితం ఎప్పటికైనా వస్తుందని మరోసారి బన్నీ ప్రూవ్ చేశాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండియహెరాల్డ్.కామ్ టీం తరపున స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తున్నాము. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: