సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా చిరంజీవి నీడ కింద వచ్చిన వాళ్ళే. చిరంజీవి పుణ్యమా అని నటన వచ్చినా, డాన్స్ వచ్చినా రాకపోయినా సరే హీరోలు అయ్యారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు మెగా స్టార్ చిరంజీవి తో సన్నిహిత సంబంధాల కోసమే చూస్తూ ఉంటారు. ఆయనతో విభేదాలు కోసం ఏ ఒక్కరు కూడా ప్రయత్నాలు చేసే సందర్భం అంటూ ఏమీ ఉండదు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. తన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే పవన్ అభిమానులకు గాని, 

 

మెగా స్టార్ అభిమానులకు ఎక్కడా కూడా తన సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలని వారిని కోరిన సందర్భం ఏ ఒక్కటి ఈ మధ్య కాలంలో లేదు. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మాత్రం ముందు నుంచి చాలా దూరంగా ఉంటూ వస్తున్నాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ తో అతను రాజకీయ పరంగా విభేదించాడు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు మాత్రం అతను పవన్ కళ్యాణ్ కి దగ్గరవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అతని విషయంలో చాలా వరకు సానుకూలంగానే ఉన్నాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

అల్లు అర్జున్ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇటీవల సోషల్ మీడియా లో పోస్ట్  చేసాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ విమర్శించాడు కూడా. అప్పటి నుంచి వాళ్ళు అతని సినిమా చూడాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించి చూస్తూ ఉండే వాళ్ళు. అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారింది అంటున్నారు. అతను మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉన్నా పవన్ కి దగ్గరగానే ఉన్నాడని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: