టాలీవుడ్ లో అల్లు అర్జున్ కాస్త భిన్నమైన హీరో. అతను చేసే సినిమాలు గాని అతను ఎంచుకునే కథలు గానీ అన్ని కూడా ఎక్కువగా భిన్నంగా ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఒక్క మెగా ఫాన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క మాస్ ఆడియన్స్ మాత్రమే  కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అతని సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు బన్నీ రేంజ్ మారింది అంటున్నారు సినీ పరిశీలకులు. 

 

అతను ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. ప్రతీ సినిమా విషయంలో కూడా అతను చాలా వరకు కమర్షియల్ గానే ఆలోచిస్తున్నాడు. అదే విధంగా తన సినిమా చేసే దర్శకుడు అగ్ర దర్శకుడు అవ్వాలి అనేది అతను ఎక్కువగా చేసే డిమాండ్. నిర్మాతలకు కూడా ఇదే విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాడట. ఈ మధ్య కాలంలో అతను భారీ బడ్జెట్ సినిమాలను ఎక్కువగా కోరుకుంటున్నాడు అని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా అయితే పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట. 

 

ఇక బాలీవుడ్ స్టార్ లను కూడా తన సినిమాలో ఉంచాలని అతను దర్శకుల ముందు నిర్మాతల ముందు ప్రతిపాదన ఎక్కువగా పెడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన సినిమా తర్వాత అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆ సినిమా హిట్ తర్వాత నిర్మాతలకు అతను ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాల గురించే చెప్పడం మొదలు పెట్టాడు అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలకే డిమాండ్ పెరిగింది. అందుకే బన్నీ కూడా వెనక్కు తగ్గడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: