క‌రోనా వైర‌స్ వ‌ల్ల ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఆప‌ద‌లో, విష‌యాద స‌మ‌యంలో క‌నీసం ఒక‌రికొక‌రు ప‌ల‌క‌రించుకునే, ప‌రామ‌ర్శించునే అవ‌కాశం కూడా లేకుండా పోతోంది. ఆప్తుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన స‌మ‌యంలో బంధువులు, స్నేహితులు వ‌చ్చి ఓదార్చ‌లేని దారుణ‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఒంట‌రిగా ఎక్క‌డివాళ్లు అక్క‌డ ఉండాల్సి వ‌స్తోంది. తాజాగా.. టాలీవుడ్‌లో వ‌రుస‌గా చోటుచేసుకున్న రెండు ఘ‌ట‌న‌లతో అంద‌రూ విషాదంలో మునిగిపోయారు. బుల్లితెర‌, వెండితెర‌పై త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న దంప‌తులు రాజీవ్ క‌న‌కాల సుమ ఇంట్లో మ‌ళ్లీ విషాదం నెల‌కొంది. గత ఏడాది కాలంలోనే రాజీవ్ కనకాల తన తండ్రి, తల్లి, సోదరిని కోల్పోయారు. అయితే.. తండ్రి, తల్లి మరణాల సమయంలో అంద‌రూ వ‌చ్చి వారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. 

 

తాజాగా రాజీవ్ క‌న‌కాల‌ తన సోదరి శ్రీలక్ష్మిని కూడా కోల్పోయారు. దీంతో రాజీవ్ క‌న‌కాల కుటుంబాన్ని తీవ్ర విషాదానికి గురిచేసింది. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 6వ తేదీన శ్రీ‌ల‌క్ష్మి మరణించారు. దీంతో రాజీవ్, సుమ దంపతులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. ఇదే తేదీన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి మృతి చెందారు. దాంతో ఆయన విషాదంలో మునిగిపోయారు. ప‌లువురు ప్రముఖులు ఫోన్‌లోనే ఓదార్చారు. అయితే.. .క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎవ‌రు కూడా వారి ద‌గ్గ‌రికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. విషాద స‌మ‌యంలో వారిని ఓదార్చి అండ‌గా ఉండ‌లేని ద‌య‌నీయ‌ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్య‌లు, స్నేహితులు అంద‌రికీ రిక్వెస్ట్ చేశారు. ద‌య‌చేసి ప‌రామ‌ర్శించేందుకు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని, మీకు చేతులెత్తి దండం పెడ‌తామ‌ని చెప్పారు. అలాగే, రాజీవ్ కనకాల స్నేహితుడు నటుడు హర్షవర్ధన్ ఓ ఆడియో ఫైల్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప‌రామ‌ర్శించ‌డానికి ఎవరూ ఇంటి వయకటకు రావొద్దని.. ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. రాజీవ్, సుమ కుటుంబం మానసికంగా ధైర్యంగా ఉంద‌ని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: