పెళ్లి అయిన తర్వాత పూర్తిగా మారిన హీరోల్లో బన్నీ ఒకడు. అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో ప్రేక్షకుల ఆలోచనను పూర్తిగా మార్చాడు అనేది అందరికి అర్ధమవుతుంది. మాస్ ఆడియన్స్ కాదు ఫ్యామిలీ ఆడియన్స్ తన సినిమాలను చూడాలి అనే నిర్ణయానికి వచ్చి సినిమాలను ఆ విధంగా ఉండే విధంగా ప్లాన్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అతని భార్య అని అంటున్నారు. ఆమె బన్నీ ఆలోచనను పూర్తిగా మార్చింది అంటున్నారు. అల్లు అర్జున్ చేసే సినిమాల విషయంలో ఆమె ఎక్కువగా జోక్యం చేసుకోవడమే దీనికి కారణం అనే వాళ్ళు ఉన్నారు. 

 

ప్రతీ సినిమా కథ కూడా ఆమె వినడం మొదలు పెట్టింది. అప్పటి నుంచే బన్నీ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని అంటూ ఉంటారు. ఇక నిర్మాతలకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధంగా సినిమాలను తీసుకు రావాలని ఆమె చెప్పినట్టు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో అతని సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగా ఉంటున్నాయని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే అతను చేసే సినిమాల విషయంలో అతని లుక్ మీద కూడా ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారని అంటున్నారు. 

 

పెళ్ళికి ముందు ఎక్కువగా అతను స్టైల్ గా ఉండే వాడు. కాని పెళ్లి తర్వాత అది పూర్తిగా మారింది. అతను సినిమాల్లో చాలా క్లాస్ గా కనపడుతున్నాడు. క్లాస్ లుక్ కి పూర్తిగా మారిపోయాడు. హెయిర్ స్టైల్ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగానే ఉంటుంది. చేయబోయే సినిమాల విషయంలో కూడా అతను ఇలాగే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ సినిమాల్లో కూడా ఇలాగే ఉండాలని అతను భావిస్తున్నాడు. అందుకే దర్శకులు కూడా క్లాస్ నే తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: