టాలీవుడ్ లో ఇప్పుడు అల్లు అర్జున్ హాట్ టాపిక్. ఇటీవల వచ్చిన అతని సినిమా హిట్ అవ్వడం తో అతను చేసే సినిమాల విషయంలో అందరికి ఆసక్తి ఎక్కువైంది అనేది వాస్తవం. అతన్ని తిట్టిన వాళ్ళు కూడా అతని సినిమాల కోసం ఎక్కువగా ఎదురు చూడటం మొదలు పెట్టారు అనేది అర్ధమవుతుంది. అందుకే అల్లు అర్జున్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతను సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అతను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

అతని సినిమాల విషయంలో ఇప్పటి వరకు ఉన్న లెక్క ఒకటి ఇప్పుడు నుంచి ఉన్న లెక్క మరొకటి. అందుకే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సుకుమార్ తో చేసే సినిమాలో అతను ప్రయోగం చేస్తున్నాడు అంటున్నారు. గ్రామ స్థాయిలో అతని సినిమా ఉంటుంది అంటున్నారు. అక్కడ అతను ఒక పాలేరుగా నటిస్తాడని రాయలసీమ ఫ్యాక్షన్ కథ ఆధారంగా ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రయోగం చేయడానికి అతను రెడీ అయ్యాడని అందుకే సుకుమార్ కూడా జాగ్రత్తగా కథ రెడీ చేసాడని సమాచారం. 

 

సినిమా కథ ఇప్పటికే పూర్తిగా సిద్దమైంది. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని రెడీ చేయించాడు అల్లు అర్జున్. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. కరోనా వైరస్ తగ్గగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బరువు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. భారీగా ఈ సినిమా కోసం అతను పెరుగుతున్నాడు అంటున్నాడు. సుకుమార్ ఆలోచనకు తగిన విధంగా నటిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: