సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ ఎవ్వరి మీదైనా ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఎవరిని పడితే వారిని తిట్టేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం  ఉందో..దాన్ని సరైన వాటికి వినియోగించకపోవడం వల్ల అంటే నష్టం కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కోసారి నష్టం మరీ ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. సెలెబ్రిటీల మీద చేసే కామెంట్స్ చూస్తే అవును నిజమే అనిపించక మానదు.

 

తెలుగు సినిమా హీరోలకి అభిమానులు బాగానే ఉన్నారు. ఒక్కో హీరోకి ఒక్కో ఆర్మీలాగా అభిమానగణం ఉంది. ఆ అభిమానులే హీరోలకి బలం..కానీ ఒక్కోసారి వారే బలహీనతగా కూడా మారుతున్నారు. అవతలి హీరోకంటే మా హీరో గొప్పని చెప్తూ సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకోవడం దగ్గర నుండి సినిమా నుండి అప్డేట్ ఇవ్వకపోతే బ్యాన్ చేస్తామంటూ బెదిరించడం చూస్తుంటే హీరోలకి అభిమానులు బలహీనతలాగే కనిపిస్తుంది.

 


తాజాగా ప్రభాస్ అభిమానులు యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేస్తున్నామని ట్రెండ్ చేశారు. ప్రభాస్ సినిమాకి నిర్మాతగా ఉన్న యూవీ క్రియేషన్స్ ఎలాంటి అప్డేట్ వదలట్లేదని అందుకే బ్యాన్ చేసేద్దామని ట్రెండ్ చేశారు. ఈ విషయమై యూవీ క్రియేషన్స్ వివరణ కూడా ఇచ్చింది. కరోనా కారణంగా ఫస్ట్ లుక్ విడుదల చేయలేమంటూ చెప్పినా కూడా ఫ్యాన్స్ గోల చేయడం ఆపట్లేదు. అయితే ఇక్కద అభిమానులు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది.

 

హీరోలు ఏం చేసినా అది అభిమానులకి నచ్చాలనే ఉద్దేశ్యంతోనే చేస్తారు. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. అలాంటి హీరో సినిమా నుండి అప్డేట్ అంటే అన్నీ చూసుకుని రిలీజ్ చేయాలి. అభిమానులు అడుగుతున్నారు కదా అని ఆగమాగం ఏదో ఒకటి వదిలేయలేరు కదా. నేషనల్ స్టార్ అయినప్పుడు ఆ మాత్రం స్టాండర్డ్స్ మెయింటైన చేయాల్సి వస్తుంది. లేదంటే అభిమానులే నిరుత్సాహ పడాల్సి వస్తుంది. అందువల్ల అతి చేయడం ఆపేస్తే మంచిదని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: