ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచ మంతా ఇంటికే పరిమతమైంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు కూడా చాలా ఖాళీ సమయం దొరికింది. దీంతో తమ గత అనుభవాలను మీడియాతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు స్టార్స్‌. తాజాగా సీనియర్ నటి రవీనా టండన్‌ రెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను అభిమానులతో షేర్ చేసుకుంది.

 

2017లో న్యూయార్క్ ట్రిప్‌లో భాగంగా జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఆ వీడియోలో వన్‌ పీస్‌ రెడ్ కలర్‌ డ్రెస్‌ వేసుకున్న రవీనా, న్యూయార్క్‌ వీదుల్లో డ్యాన్సులు చేస్తోంది. ఈ వీడియోలో రవీనాతో పాటు  భర్త అనిల్‌ తడాని, కూతురు రాషా కూడా ఉన్నారు. ప్రస్తుతం న్యూయర్క్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అప్పటి ఆనందకరమైన పరిస్థితులు తిరిగి రావాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ఈ వీడియోతో పాటు ఆ రోజు రోడ్ మీద నా బిహేవియర్ చూసి నా కూతురు రాషా ఇబ్బంది పడిందని తెలిపింది రవీనా.

 

ప్రపంచం మొత్తం ఈ కష్ట కాలం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆనందకరమైన, ఆరోగ్యవంతమైన కొత్త ప్రపంచం అవతరించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 13 లక్షలకు పైగా ప్రజలకు ఈ వైరస్‌ సోకింది. 70 వేలకు పైగా ప్రజలు ఈ వైరస్‌ కారణంగా మరణించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#throwback (2017) #THROWBACK to the days when the streets of #newyork were full of fun and happiness! Now - Prayers for all in New York , india,Maharashtra , italy , london . 🕉🙏🏻🕉 May the world heal and we all see a better brighter healthier planet soon. Rest in peace all those who succumbed to this disease . You will always be in our prayers . In this video , Rasha @officialrashathadani as usual totally embarrassed by my behaviour ,Anil and I teasing her even more and she tries to run away ! 😊. Video credit - @official_ranbirvardhan_thadani @ranbir_loves_mufc

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

మరింత సమాచారం తెలుసుకోండి: