అల్లు అర్జున్‌.. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోంగ్ ఉందో ప్ర‌త్యేకంగా లెక్క‌లు అవ‌స‌రం లేదు. చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. గొప్ప పేరున్న కుటుంబంలో పుట్టడమే కాకుండా.. ఆ కుటుంబానికి ఇంకా గొప్ప పేరు తీసుకు వచ్చిన ఒక గొప్ప న‌టుడు ఈయ‌న‌. ఇక కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు..  కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్ చూపించి ప్రేక్ష‌కుల‌ను అభిమానులుగా మార్చుకున్నారు. ఇక నేడు ఈ స్టైలిష్ స్టార్ 38వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు.

 

అయితే ఈయ‌న కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్..1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు . చిన్నప్పుడే తన మామ చిరు నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు.  అనంతరం మెగాస్టార్ మూవీ ‘డాడీ’లోనూ ఓ రోల్ చేశాడు. ఇక హీరోగా  కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్య  సినిమాతో కేరళలో ఓ ఊపు ఊపేశాడు. అక్క‌డ చాలా థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ఆడింది.

 

ఇక బన్నీకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్, డ్యాన్సింగ్‌తో పాటు ఫొటోగ్రఫీని కూడా చాలా ఇష్టపడతాడు. ఈ హాబీని బ‌న్నీ ఓ స్ట్రెస్ రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. అలాగే అల్లు అర్జున్ యానిమేషన్ కోర్స్ కూడా నేర్చుకున్నాడు. ఇందులో ఎన్నో టెక్నీక్స్ ఆయ‌న‌కు తెలుసు. ఇక బ‌న్నీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన‌పుడు ఎవ‌రీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవ‌చ్చా..? ప్రేక్ష‌కుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

 

బ‌హుశా తెలుగులో ఏ వార‌సుడిపై కూడా ఈ స్థాయి విమ‌ర్శ‌లు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వ‌చ్చాయి. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్.. స్టైలిష్ స్టార్‌ అంటున్నాయి. ఎందుకంటే బ‌న్నీ క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి మ‌రి. కాగా, నేడు ఆయ‌న 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సారి లాక్‌డౌన్ నేపథ్యంలో అభిమానుల మధ్య కాకుండా ఇంట్లోనే సింపుల్‌గా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు.

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: