అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా నాగార్జున కొడుకుగా పుట్టడం ఒక అదృష్టం. అయితే అఖిల్ పుట్టుకలో ఉన్న అదృష్టం కెరియర్ పరంగా లేదా అని అనిపించడం సహజం. అఖిల్ ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడమే కాకుండా ఓపినింగ్స్ కలక్షన్స్ పరంగా కూడ అఖిల్ సినిమాలకు ప్రతి సినిమా సినిమాకు డౌన్ ఫాల్ రావడం ఒక విధంగా డేంజర్ బెల్స్ మోగించే విషయం. 

 

అఖిల్ అక్కినేని కుటుంబ వారసుడు కాకుంటే ఈ పాటికే అతడి పుట్టినరోజు కూడ మీడియా గుర్తుకు చేసుకునేది కాదు. అయితే పరాజయాలు ఎదురౌతున్న కొద్ది రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న అఖిల్ తన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ద్వారా తనకు ఈసమ్మర్ లో అదృష్టం వస్తుందని భావిస్తే ఇక్కడ కరోనా అఖిల్ కెరియర్ కు శాపంగా మారింది. 

 

వాస్తవానికి అఖిల్ కు సినిమా హీరోగా కన్నా క్రికెటర్ గా చాల మంచి పేరు వచ్చింది. స్టార్ క్రికెట్ టోర్నమెంట్స్ లో అఖిల్ కొట్టే ఫోర్లు సిక్సర్లు చూసి యూత్ ముఖ్యంగా అమ్మాయిలు అఖిల్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. అఖిల్ క్రికెటర్ గా తన ప్రోఫిషన్ ను కొనసాగించి ఉంటే అతడు ఖచ్చితంగా తెలుగు ప్రజలు గర్వించే క్రికెటర్ అయి ఉండేవాడు. 

 

అయితే విధి మరో విధంగా నడిపించడంతో అఖిల్ హీరోగా సెటిల్ కావడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అఖిల్ కు చరణ్ చాలమంచి సాన్నిహిత్యం ఉంది. వాస్తవానికి వయసులో చరణ్ అఖిల్ కన్నా చాల పెద్దవాడు అయినా తరుచు చిరంజీవి ఇంటికి వెళ్ళడమే కాకుండా అక్కడ చిరంజీవి భార్య సురేఖ తో చాల అభిమానంగా సొంత కొడుకులా మాట్లాడుతాడట. అఖిల్ చూపించే ప్రేమకు  పొంగిపోయిన సురేఖ ఒక సందర్భంలో తన భర్త  చిరంజీవితో అఖిల్ ని పెంచుకుందామా అని నవ్వుతు అడిగినప్పుడు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా నాగార్జున అఖిల్ ను ఇచ్చేస్తాడా అంటూ చిరంజీవి జోక్ చేసాడట. అందగాడు గా మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నా అఖిల్ కు అదృష్టం కనికరించడంలేదు కనీసం ఈపుట్టినరోజు నుండి అయినా అఖిల్ జీవితంలోకి అదృష్టం ఎంటర్ కావాలని అతడి అభిమానులు మనసార కోరుకుంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: