అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రివేంజ్ డ్రామాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్మాడు.

 

నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేసింది. చిత్తూరు ప్రాంత నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అక్కడ విరివిగా వాడే "పుష్ప" అనే పేరుని టైటిల్ గా ప్రకటించారు. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ ఊరమాస్ గా ఉంది. పెరిగిన గడ్డం, చెదిరిన జుట్టు, మెడలో తాయెత్తు, చొక్కాకి రెండు బటన్లు వదిలేసి చూడగానే లారీ డ్రైవరే అనిపించేంత  సహజంగా ఉన్నాడు.

 

ఒక్క క్షణం బన్నీయేనా ఆ పోస్టర్ లో ఉంది అని అనిపించినా ఆశ్చర్యం లేదు. అంతలా మారిపోయాడు. సాధారణంగా తన ప్రతీ సినిమాలో లుక్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే బన్నీ ఈ సారి కంప్లీట్ గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అల వైకుంఠపురములో అల్ట్రా స్టైలిష్ గా కనిపించి, వైవిధ్యమైన నటనతో స్క్రీన్ ప్రెసెన్స్ తో మెస్మరైజ్ చేసిన బన్నీ మరోసారి మరో కొత్త అవతారంలో ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుందేమో అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే టైటిల్ పోస్టర్ ని తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోనూ విడుదల చేశారు. బన్నీకి గత కొంతకాలంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలని తీయాలను ఉందని తెలిసిందే. ఆ అవకాశాన్ని ఫుష్పతోనే తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: