స్టైల్ ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం  అయ్యాడు అల్లు అర్జున్. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిరంజీవి అల్లుడు, అల్లు అరవింద్ కొడుకు అయినా గాని వాళ్ళ పేరు చెప్పుకుని పైకి రాలేదు. టాలెంట్ ని నమ్ముకుని పైకి వచ్చాడు. స్టైలిష్ స్టార్ గా మారాడు. దేశముదురు, ఆర్య సినిమాలతో  తనకంటూ ఒక ప్రేత్యేకమైన మార్క్ వేసుకున్నాడు.

 

సినిమా సినిమాకి స్టైల్ విషయంలో గాని, పాత్ర చిత్రీకరణలో గాని వేరియేషన్స్ చూపిస్తాడు. ఒక పక్క మాస్ హీరోగా, ఇంకోపక్క లవర్ బాయ్ గా నటించి మెప్పించాడు. క్యారెక్టర్ ఏదయినా గాని దానికి 100% న్యాయం చేస్తాడు. ఇంకా డాన్స్ విషయం అయితే చెప్పక్కర్లేదు. సినిమా సినిమాలో ఎదో ఒక ప్రయోగం చేస్తాడు.  హీరోయిన్స్ సైతం మనోడి పక్కన డాన్స్ వేయాలంటే భయపడిపోతారు. సింగల్ టేక్ లో ఓకే చేస్తాడు స్టెప్. ఫాన్స్ ని మెప్పించే స్టెప్స్ తో సినిమా హాల్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో టాప్ డాన్సర్ లిస్ట్ లో మన స్టైలిష్ స్టార్ ఒకడు. సినిమా లో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ గాని, డ్రెస్ డిజైన్ కానీ, కాస్ట్యూమ్స్ గాని డిఫరెంట్ గా ఉంటాయి.

 

అలానే పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుంది.. మనోడు డైలాగ్స్ చెప్తే చాలు సినిమా హాల్లో విజిల్స్ మోత మోగాలిసిందే. అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని  సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత  అల్లుఅర్జున్ ది. అల్లు అర్జున్ సినిమా కెరీర్ అంతా  కొన్ని హిట్లు కొన్ని ప్లాపులతో సాగింది.. హిట్ వచ్చినపుడు గర్వపడి, సినిమా ప్లాప్ అయినపుడు కుంగి పోలేదు. ఏప్పుడు ఒకేలాగా ఉన్నాడు..ఆపద సమయంలో కూడా డబ్బు విరాళంగా ఇచ్చి ఆదుకుంటాడు. అలా వైకుంఠపురం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

 

ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు స్టైలిష్ స్టార్.ఇన్ని యాంగిల్స్ ఉన్న అల్లు అర్జున్ ని నిజంగానే ఫాన్స్ స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. అల్లు అర్జున్ కూడా నిజంగానే ఫాన్స్ ఇచ్చిన బిరుదుని నిజం చేసాడుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: