’ఆంజనేయ‌స్వామితో నాకు అనుబంధం ఉంది’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షాలు తెలిపారు. అంతేకాకుండా ఆంజనేయస్వామితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.  ‘ఆంజ నేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...  1962 లో నాకు  ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అ లాగే భద్రంగా ఉంది.. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి" అన్నారు. 

‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అ ది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా?..  "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ... అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: