కరోనా వైరస్ కారణంగా జనాల్లో ఒకలాంటి నైరాశ్యం కూరుకున్న సమయాన భవిష్యత్తు మీద ఒక రకమైన ఆశ కలిగించడానికి ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ తో వచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చాడు. ఈ ఆపత్కాల సమయం కొన్ని రోజులే ఉంటుంది. వచ్చేవన్నీ మంచి రోజులే అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని రెండింతలు చేసాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ ని విడుదల చేశాడు.

 

పుష్ప పేరుతో విడుదలైన ఈ టైటిల్ పోస్టర్ లో బన్నీ లుక్ అదిరిపోయింది. రంగస్థలంతో మాస్ సినిమాలు సుకుమార్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపించాడు. ఈ సారి ఊరమాస్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. పోస్టర్ లో బన్నీ కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ చూస్తుంటే ఆ పాత్ర పట్ల బన్నీ ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థం అవుతోంది. రంగస్థలం సినిమాలో చరణ్ కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూసినట్టుగానే పుష్ప లోనూ బన్నీ పర్ ఫార్మెన్స్ అదిరిపోనుందని అర్థం అవుతుంది.

 

అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి డబుల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నట్టుంది చిత్ర బృందం. అందుకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మరో రెండు గంటల్లోనే సెకండ్ లుక్ ని వదిలారు. ఈ లుక్ లో పోలీసులకి పట్టుబడ్డ బన్నీని చూడవచ్చు. నేలమీద కూర్చుని చేతికి కడియం, వేలికి ఉంగరం, చింపిరి జుట్టు, వెనకాల ఎర్రచందనం దుంగలతో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పేశాడు సుకుమార్.

 

ఇప్పటి వరకు అల్ట్రా స్టైలిష్ లుక్ కనిపించిన బన్నీ ఒక సాధారణం లారీ డ్రైవర్ గా ఇంకా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయన శైలిలో ఇదో ప్రత్యేకం అని చెప్పవచ్చు. పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్ట్ర్ ని తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది పాన్ ఇండియా మూవీ అని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: