స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్‌లోనే అత్యంత స్టైలిష్ స్టార్ అని చెప్పాలి. ఆయ‌న రూటే సెప‌రేట్‌. బ‌న్నీ డ్యాన్స్‌కి ఫిదా అవ్వ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాద‌ని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే... బ‌న్నీ చిత్రం 2005 ఏప్రిల్ 5న విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది.  బ‌న్నీ అప్ప‌టికి మూడు చిత్రాల హిట్‌ల‌తో హ్యాట్రిక్ కొట్టారు. ఆ చిత్రంతో మాస్ స్టోరీస్ కూడా డీల్ చెయ్య‌గ‌ల‌డ‌ని నిరూపించుకున్నాడు. ఆయ‌న న‌టించిన మూడు సినిమాల్లో కూడా డ్యాన్స్‌ల‌తో పాటు మంచి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఇండ‌స్ట్రీకి మ‌రో టాలెంటెడ్ హీరో దొరికాడ‌ని సినీ విశ్లేష‌కులు అనుకున్నారు. ఆ త‌ర్వాత క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 2006లో హ్యాపీ సినిమాలో న‌టించాడు. ఆసినిమా కూడా బాగానే హిట్ అయింది. 

 

సినిమా నుంచే బ‌న్నీ స్టైలిష్‌గా క‌నిపించి స్టైలిష్‌స్టార్‌గా బిరుదును సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత 2006లో పూరి ఒక క‌థ చెప్పాడు ఆ క‌థ కోసం బ‌న్నీ ముంబ‌యిలోని స‌ల్మాన్‌ఖాన్‌కి ట్రైనింగ్ ఇచ్చిన ఒక ట్రైన‌ర్‌తో ట్రైనింగ్ ఇప్పించి సిక్స్‌ప్యాక్ చేయించారు. ఈ సినిమాతో బ‌న్నీ సౌత్ ఇండియాలోనే ఫ‌స్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో పూరి మార్క్‌తో పాటు బ‌న్నీ స్టైల్ పొడ‌వైన జుట్టుతో త‌న మార్క్‌ని కూడా మ‌రొక్క‌సారి చూపించి బాలీవుడ్ హీరోల‌కి ఏమాత్రం త‌క్కువ‌కాన‌ని ఆయ‌న నిరూపించాడు.

 

సినిమా 2007లో సంక్రాంతికి విడుద‌లై దేశ‌ముదురు చిత్రం కాసుల వ‌ర్షం కురిపించింది. ఇదే సంవ‌త్స‌రంలో మావ‌య్య న‌టించిన శంక‌ర్‌దాదా జిందాబాద్‌లో ఒక పాట‌లో క‌నిపించి అభిమానుల్ని ఉర్రూత‌లూగించాడు. ఆ త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌రుగు సినిమాలో 2008 మే1 న విడుద‌లైంది. స్టార్ డ‌మ్ యాక్టింగ్‌తో మెచ్యూరిటీ లెవ‌ల్ యాక్టింగ్‌ని క‌న‌బ‌రిచాడు. ఈ సినిమా మొద‌ట డివైడ్ టాక్ తో స్లో క‌లెక్ష‌న్ల‌తో మొద‌లై మూడ‌వ రోజునుంచి హిట్ చిత్రంగా నిలిచి దిల్‌రాజుకి  క‌లెక్ష‌న్ల పంట పండించింది. అలా సినిమా సినిమాకి మార్కెట్‌ని విస్త‌రించుకుని అభిమాన ఘ‌నాన్ని సొంతంగా ఏర్ప‌ర్చుకున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య‌కి సీక్వెల్‌గా ఆర్య‌2 ని చేశాడు.  అయితే ఆ చిత్రం మాత్రం అంత‌గా ఆక‌ర్షిచ‌లేక‌పోయింది. టాలీవుడ్‌లో ఫ‌స్ట్ టైమ్ సీక్వెల్ సంప్ర‌దాయాన్ని మొద‌లు పెట్టింది మాత్రం ఈ సినిమాతోనే .

మరింత సమాచారం తెలుసుకోండి: