నా పేరు సూర్య తరువాత ఏడాది గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ ఏకంగా మూడు సినిమాలను చేయనున్నట్లు ప్రకటించాడు. అందులో మొదటిది అల.. వైకుంఠపురములో.. ఈసినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వడం జరిగిపోయింది. ఈసినిమా తరువాత అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో నటించాల్సి వుంది కానీ ఎందుకో ఈసినిమా ను మొదలుపెట్టడానికి బన్ని ఆసక్తిని చూపించలేదు దీని స్థానం లో సుకుమార్ తో సినిమా ను చేయడానికి రెడీ కావడం తో ఐకాన్  కథ ముగిసినట్లే అనుకున్నారు కానీ ఈ సినిమా ఇంకా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఐకాన్ పోస్టర్ తో విషెస్  తెలిపాడు. అన్ని కుదిరితే సుకుమార్ తో సినిమా ను పూర్తి చేసి బన్ని, ఐకాన్ ను మొదలు పెట్టనున్నాడు.  ఈలోగా వేణు శ్రీరామ్, పింక్ రీమేక్ వకీల్ సాబ్ ను పూర్తి చేయనున్నాడు. 
 
ఇక సుకుమార్ సినిమా విషయానికి వస్తే ఈ రోజు  ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ల ను విడుదలచేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ను పెట్టారు. అయితే ఈటైటిల్ పై అభిమానుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ వస్తుంది. ఓ పెద్ద హీరోకు ఇలాంటి టైటిల్ ఏంటని పెదవి విరుస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమాకు సింహాచలం అనే  టైటిల్ పెడదామనుకున్నారు కానీ చివరి నిమిషంలో పుష్ప ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో పక్కా మాస్ లుక్ లో కనిపించనున్నాడు అల్లు అర్జున్. రష్మిక కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: