స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పుష్ప సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాతో పాటుగా బన్ని మరో సినిమా ఐకాన్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. 

 

బన్ని మొత్తం ఫోకస్ మొత్తం పుష్ప సినిమా మీద పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం మాస్ లుక్ లో బన్ని కనిపిస్తున్నాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ఉన్నారు. మొదటిసారి అల్లు అర్జున్ సినిమా 5 భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఆగిపోయింది అనుకున్న ఐకాన్ మూవీ యూనిట్ నుండి బన్నికి బర్త్ డే గ్రీటింగ్స్ అందించారు. అంటే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ఐకాన్ చేస్తాడని అఫీషియల్ గా మరోసారి వెళ్లడించారు. 

 

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ సినిమా అంటే సినిమా పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ కాంబోలో వచ్చిన సినిమా లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక రాబోయే ఐకాన్ మూవీ కూడా బన్నికి క్రేజీ ప్రాజెక్ట్ కానుంది. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవర్ స్టార్ పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్టు కొడితే బన్ని ఐకాన్ కి మరింత క్రేజ్ వచ్చినట్టే. మరి పుష్ప తర్వాత ఐకాన్ బన్ని ప్లాన్ అదిరిపోయేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: