దేశమంతా ఇప్పుడు కరోనా భయంతో ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే. గత నెల కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోమొదట థియేటర్లు, షాపింగ్ మాల్స్, మద్యం షాపులు, పబ్ బలు అన్నీ మూసి వేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించారు.  ఆ తర్వాత అంటే గత నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.   దాంతో అన్ని రంగాలు స్తంభించిపోయాయి.  దాంతో సినీ పరిశ్రమ మొత్తం షెడ్ డౌన్ అయ్యింది. మొత్తానికి కరోనా పాపం ఇప్పుడు సినీ పరిశ్రమకు చుట్టుకుంది.. కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది.  రోజు కూలీలకు తిండి దొరకని పరిస్థితి.. సినీ కార్మికుల కోసం ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ముందుకొచ్చారు.

 

చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ ) పేరుతో పెద్ద ఎత్తున్న విరాళాలు సేకరిస్తున్నారు. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే విరాళాలు అందించారు. మరికొందరు సినీ కార్మికులకు పండ్లు, కూరగాయలు, బియ్యం అందిస్తున్నారు. ఇటీవల నటి రకూల్ ప్రీత్ సింగ్ తన ఇంటి నుంచి వంటలు వండి పేద ప్రజలకు సప్లై చేస్తుందని చెప్పింది.  తాజాగా రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఈ ఛానల్ లో వంటలు ఎలా చేయాలో ఈ అమ్మడు నేర్పిస్తుంది.తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పీఎం కేర్‌ ఫండ్స్‌కు అందించనున్నట్టు తెలిపింది.  తన ఇంటికి సమీపంలోని ఉపాధి కోల్పోయిన 200 కుటుంబాలకు ఆహారం అందిస్తోంది.

 

తాజాగా రకూల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఇంటి వద్ద ఖాళీగా ఉన్నానని.. దేశంలో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో మనం ఎంత సహాయం అందించినా తక్కువే అన్నారు. నాకు చాలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలనుకున్నాను. దీని ద్వారా అన్ని సరదా విషయాలను మీతో పంచుకుంటాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పీఎం కేర్‌ ఫండ్‌కు అందిస్తాను. ప్రతి ఒక్కరం వీలైనంత ఆనందాన్ని పంచుదాం. అంటుంది రకుల్ ప్రీత్. 

మరింత సమాచారం తెలుసుకోండి: