కండలు పెంచడం, సిక్స్ ప్యాక్ చేయడం గతంలో బాలీవుడ్ హీరోలకే సొంతం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ సిక్స్ ప్యాక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 

 

ఒకప్పుడు తెలుగు హీరోలంటే బొద్దుగా కనిపించేవారు. ఎలాంటి క్యారెక్టర్ లో నటించినా ఫిజిక్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. జస్ట్ హెయిర్ స్టైల్ లేదా డ్రెసింగ్ తో మేనేజ్ చేసేవారు. కానీ ఈ జనరేషన్ హీరోలు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు. క్యారెక్టర్ ను బట్టి మౌల్డ్ అవుతున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన భీం ఫర్ రామరాజులో చరణ్ ను చూసిన వారికి మతిపోయింది. ఇప్పుడు నిఖిల్ సైతం వావ్ అనిపించే రేంజ్ లో బాడీ బిల్డింగ్ చేయడం ఆసక్తిగా మారింది. 

 

నిఖిల్ గత ఏడాది అర్జున్ సురవరంతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలెంట్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలోపు నిఖిల్ కూడా ఫిట్ గా తయారవ్వాలని.. బాడీ బిల్డ్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. ఇప్పుడు ఎలాగూ లాక్ డౌన్ కాబట్టి సమయం వృధా చేయకుండా కసరత్తులు చేస్తూ.. సిక్స్ ప్యాక్ తీసే పనిలో ఉన్నాడు. 

 

రీసెంట్ గా సోషల్ మీడియాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ లో ఉన్న షర్ట్ లెస్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. కండలు పెంచి పర్ ఫెక్ట్ ఫిజిక్ తో నిఖిల్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్నాడు. కార్తికేయ సీక్వెల్ లో నిఖిల్ షర్ట్ లెస్ కనిపించే సీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియడం లేదు. మొత్తానికి ఈ యంగ్ హీరో సైతం సిక్స్ ప్యాక్ హీరోల గ్రూప్ లో చేరాడు. నిఖిల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. మరి కార్తికేయ సీక్వెల్ తో మరో స్టెప్ పైకి ఎక్కుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: