చిరంజీవి మెగాస్టార్. టాలీవుడ్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజ్. అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్ ఒక్కడే టాప్ చైర్లో కూర్చున్న హీరో అంటారు. ఆయన ముందు తరువాత అన్నంతగా టాలీవుడ్ విభజన జరిగింది. టాలీవుడ్ కి ఒక్కసారిగా పదిమెట్లు ఎక్కించిన ఘనత కూడా చిరంజీవిదే.

 

ఓ సామాన్యుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తరువాత కాలంలో టాలీవుడ్ మొత్తం బరువు పరువు తాను అయి వెలిశాడు. చిరంజీవి అద్భుతమైన కెరీర్ ఓ దశాబ్దం పాటు కొనసాగింది. ఆ టైంలో ఆయన సినిమా చేస్తే కనక వర్షమే. హిట్టూ ఫట్టూ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

 

ఇక 1992 సంవత్స‌రానికి వస్తే ఆ ఏడాది చిరంజీవి రాఘవేంద్రరావు దేవీవర ప్రసాద్ ల కాంబోలో  ఘరానా మొగుడు మూవీ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ నగ్మా. అప్పటికి హాట్ బ్యూటీ  ఆమె. ఇక రాఘవేంద్రరావు ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మేట్ లో తీర్చిదిద్దాడు. ఈ  మూవీలో నమస్కారం పెడుతూ  హీరో   స్పెషల్ మ్యాన‌రిజం చేస్తాడు. అది చిరంజీవి పండించేశాడు. 

 

 

అలాగే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ ఆయన చెప్పే డైలాగు కూడా మూవీ రేంజిని ఎక్కడికో తీసుకుపోయింది. చిరంజీవి గురువు గారూ అంటూ రావు గోపాలరావు కు పెట్టే మస్కా నమస్కారం ఆ రోజుల్లో ఘరానా మొగుడుకు పది కోట్లు వసూల్ చేసి పెట్టింది. టాప్ హిట్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఘరానా మొగుడుకు కీరవాణి పాటలు అతి పెద్ద అసెట్. మొత్తం మీద చూసుకుంటే ఈ మూవీతో బాలీవుడ్ సైతం షాక్ తినేలా కలెక్షన్ల వర్షం నాడు కురిపించేశాడు మన మెగాస్టార్. సో ఎవర్ గ్రీన్ స్టార్ మన చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: