అఖిరానందన్ ఈ పేరు తెలియని వారు సినీ జీవులే కాదు. ఎందుకంటే సినిమా వార్తలు ఫాలో అయ్యే వారికి ఈ పేరు చిర పరిచితమే. ఆయన తండ్రి, పెద తండ్రి, అన్నయ్యలు,  మామలు అందరూ టాప్ రేంజి హీరోలే. మొత్తానికి అఖిరా అద్రుష్ట జాతకుడు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు.

 

పవన్, రేణూ దేశాయ్ లకు పుట్టిన అఖిరానందన్  పుట్టిన రోజు ఈ రోజు. మరి పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి ఒక్కలా లేదు. ఎటు చూసినా భీభత్సమే. సోషల్ మీడియా అంతా అఖిరా మానియాతో అట్టుడిపోతోంది. అఖిరాను గ్రీట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టింగులలతో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆ క్రేజ్ మామూలుగా లేదుగా.

 

ఇదే రోజు అల్లు  అర్జున్, నాగార్జున కొడుకు అఖిల్ బర్త్ డే కూడా. అయితే అల్లు అర్జున్ టాప్ రేంజి హీరో. ఆయనతో సమానంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న అఖిరానందన్ ఫ్యూచర్  స్టార్ గా కొత్త రికార్డులు బద్దలు కొట్టేసేలా ఉన్నాడు.

 

ఆయన పెదనాన్న చిరంజీవి అన్నట్లుగా తమ కంటే బిడ్డ ఎత్తు ఎదిగాడు, ఇపుడు సినిమా వాసన లేకుండానే సోషల్ మీడియాలో తనదైన మానియాని క్రియేట్ చేసి పారేశాడు. ఇంతకీ అఖిరానందన్ కి సినిమాల్లో నటించాలని ఉందో లేదో కూడా తెలియదు. ఆయన ఇపుడు టీనేజ్ లో ఉన్నాడు.

 

మరో రెండు మూడేళ్ళకు కానీ హీరో అవుతాడో లేడో తెలియదు కానీ వస్తే మాత్రం రెడ్ కార్పెట్ పరచేసి గుండెల్లో గూడు కట్టేసేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అఖిరానందన్ క్రేజ్ చూసిన వారికి వారేవా తండ్రిని, పెద తండ్రిని కూడా ఈ కుర్రాడు మించేసేటట్లున్నాడే అనిపించకమానదు. మొత్తానికి అఖిరానందన్ భీభత్సమే. ఒక అద్భుతమే.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: