బాలీవుడ్ లో సూపర్ హిట్టైన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. సెకండ్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ లో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసి అలరించారు. 15 మంది ఇంటి సభ్యులు.. ఒక పెద్ద ఇల్లు.. వాళ్లకు కావాల్సిన సామాన్లు.. నో మొబైల్, నో పేపర్, నో టివి.. బయట విషయాలేవీ అసలు లోపలకు తెలియవు. 100 రోజులు ఒకే ఇంట్లో ఉంటూ ఇచ్చినా వాటితో సర్దుకుపోతూ.. ఇంటి సభ్యులతో గొడవలు పడుతూ.. టాస్కులు చేస్తూ అబ్బో అన్నిరోజులు ఒకే ఇంట్లో ఉండటం చాలా ఈజీ అని కొందరు.. అన్ని ఇస్తే మేముంటామని మరికొందరు అంటుంటారు. 


కానీ కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చుకుని ఉండమంటే మాత్రం ఉండటం ఇష్టపడట్లేదు. అయితే బిగ్ బాస్ ను తక్కువ అంచనా వేసి ఆ షోని వెటకారం చేసిన వారు కూడా ఇకమీదట ఆ షో మీద రెస్పెక్ట్ పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు బిగ్ బాస్ 4కి కచ్చితంగా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందేలా అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల టివి, సెల్ఫోన్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇలా ఇన్ని ఉన్నా సరే బోర్ కొట్టేస్తుంది. 


అలాంటిది ఒకే ఇంటిలో అందరితో గొడవలు పడుతూ టాస్కులు చేయడం మాత్రం అంట ఈజీ కాదు అన్నది ఇప్పుడు జనాలకు అర్ధమవుతుంది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ హోస్ట్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఫిలిం టాక్ ప్రకారం చూస్తే మళ్ళీ కింగ్ నాగార్జుననే బిగ్ బాస్ 4కి హోస్ట్ గా చేయిస్తారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: