అక్కినేని వార‌సుడిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున సినిమాల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా, టాలీవుడ్ మ‌న్మ‌ధుడిగా ఒక ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నాడు. అప్ప‌ట్లో నాగార్జున త‌న కెరియ‌ర్ పీక్స్‌లో ఉండ‌గా డి. రామానాయుడు కూతురు ల‌క్ష్మిని వివాహం చేసుకున్నారు. వారిద్ద‌రి సంతాన‌మే అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఒక వీరి లైఫ్‌లో ఏం జరిగిందో తెలియ‌దు కాని కొన్నాళ్ళ‌కు వీరిద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత అప్ప‌ట్లో హీరోయిన్ అయిన అమ‌ల‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇక వీరిద్దరికి పుట్టిన సంతాన‌మే అఖిల్‌. ఇక నాగార్జున విష‌యంలో జ‌రిగిన అన్ని విష‌యాలు దాదాపుగా అంద‌రికి తెలిసిన‌వే అయితే...నాగార్జున వివాహానికి సంబంధించి ఒక విష‌యం మాత్రం ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఆ విష‌యాన్నే ఆనాటి హీరోయిన్ అయిన సుమ‌ల‌త ఓ సారి బ‌య‌ట పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున జీవితంలో నాగార్జున అత‌డి పెళ్ళిళ్ళు పిల్ల‌లే ఉన్నారు కానీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరు మాత్రం ఎక్క‌డా వినిపించ‌లేదు. ఈ నాగార్జున విష‌యంలో నాగేశ్వ‌ర‌రావు పేరు చాలా త‌క్కువ‌గానే వినిపిస్తుంది. ఇక నాగేశ్వ‌ర‌రావు అప్ప‌టికే చాలా పెద్ద స్టార్ హీరో చాలా మందికి తెలియ‌నిదేమిటంటే... నాగార్జున జీవితం ఎలా ఉండాలి. అత‌నికి ఎలాంటి అమ్మాయితో వివాహం చేయాలి అన్న‌ది నాగేశ్వ‌ర‌రావు ముందుగానే ఆలోచించుమ‌రీ పెట్టుకున్నాడు. 

 

ఒక‌రోజు ఒక సినిమా షూటింగ్‌లో ఏఎన్నార్‌కి ఒక అంద‌మైన అమ్మాయి క‌నిపించింది.  దాంతో ఆయ‌న ఎక్క‌డా ఆలోచించ‌కుండా ఏమ్మా చాలా ల‌క్ష‌ణంగా ఉన్నావు నీ క‌ల‌ర్‌..హైట్‌కి త‌గ్గ‌ట్టు విదేశాల నుంచి ఓ అబ్బాయి వ‌స్తున్నాడు పెళ్ళి చేసుకుంటావా అని అడిగారు. అయితే అంత‌టితో ఆగ‌కుండా మీ అమ్మ‌గారితో కూడా మాట్లాడ‌మంటావా అని కూడా అడిగార‌ట‌. ఏఎన్నార్ మీద ఉన్న గౌర‌వంతో ఆ అమ్మాయి ఇంత‌కీ ఆ అబ్బాయి ఎవ‌రు సార్ అని అడిగింద‌ట‌. ఏఎన్నార్ ఆ అబ్బాయి మ‌రెవ‌రో కాద‌మ్మా నా కొడుకు నాగార్జున అన్నార‌ట‌. ఆయ‌నే స్వ‌యంగా అడ‌గ‌డంతో ఏమి చెప్పాలో తెలియ‌క సత‌మ‌త‌మ‌యిన‌ట్లు తానే స్వ‌యంగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. అయితే అప్పుడు అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగిఉంటే సుమ‌ల‌త నాగార్జున భార్య అయి ఉండేది. 

 

ఇక సుమ‌ల‌త ఏఎన్నార్ చెప్పిన విష‌యాన్ని ప‌ట్టించుకునే స‌మ‌యం లేక కెరియ‌ర్ లో వ‌రుస సినిమాల‌తో ముందుకు వెళ్ళింది. ఈలోపు నాగార్జున ఫారెన్ నుండి రావ‌డం రావ‌డ‌మే రామానాయుడు కూతురితో ప్రేమ‌లో ప‌డిపోయి వ‌చ్చాడు. ఇక నాగేశ్వ‌ర‌రావు వ‌ద్దు అని అన‌లేక ఆయ‌న ఇష్ట‌ప్ర‌కార‌మే వారిద్ద‌రికి వివాహం చేశారు. ఇక సుమ‌ల‌త ఆ త‌ర్వాత అప్ప‌ట్లో క‌న్న‌డ స్టార్ హీరో, మాజీ మంత్రి అయిన అంబ‌రీష్‌ని వివాహం చేసుకుని వెల్‌గా సెటిల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: