కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసినదే. ఈ లాక్ డౌన్ వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దేశంలో అని సినిమా ఇండస్ట్రీ లలో షూటింగ్ లు ఆగిపోయాయి. దేశంలో ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగానికి వెళ్ళలేక ఉపాధి లేక కుటుంబాన్ని నడిపించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా హీరోలు కరోనా వైరస్ వల్ల అవస్థలు పడుతున్న బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క సినీ కార్మికులను కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.

 

తమిళ సినిమా రంగంలో కూడా హీరోలు తినే కార్మికులను ఆదుకొనే మరోపక్క ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో కరోనా వైరస్ బాధితుల కోసం డబ్బులు సంపాదించడానికి ఒక వెరైటీ ఐడియాతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. అతనెవరో కాదు అర్జున్ కపూర్. తాజాగా ఈ కూర హీరో 'వర్చువల్ డేట్' తో విరాళాలు సేకరించి కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి  హెల్ప్ చేస్తామని చెబుతున్నాడు. 'గివ్ ఇండియా'.. 'ఫ్యాన్ కైండ్'.. వారి సహకారంతో ఈ కార్యకమం చేపట్టాడు.

 

ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను సదరు సంస్థలకు అందిస్తానని తెలిపాడు. ఇంతకీ ఫ్యాన్స్ ఏం చెయ్యాలంటే www.fankind.org/Arjun వెబ్ సైట్ లో డొనేషన్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో లక్కీ డ్రా ఏప్రిల్ 11 వ తారీకున నిర్వహించి... సదరు విన్నర్ నీ వర్చువల్ డిన్నర్ డేట్ కు ఆహ్వానిస్తాడట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో నెటిజన్లు చూసి ఈ రకంగా కూడా డబ్బులు విరాళాల రూపంలో సంపాదించ వచ్చా కలలో కూడా ఊహించలేదు అని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: