మొన్నటి సంక్రాంతి పండుగ కానుకగా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేడు తన 37 వ జన్మదినాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఇక ఆ సినిమా అనంతరం ప్రస్తుతం టాలెంటెడ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అల్లు అర్జున్. యువ నటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం జరుగుతుంది. ఇక నేడు విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి కూడా విశేషమైన స్పందన లభించింది. 

 

ఇకపోతే ఈ సినిమా టైటిల్ పుష్ప అని ఎందుకు పెట్టారు దానిపై టాలీవుడ్ లో కొంత చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ పెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందని ఒక వార్త ప్రచారం అవుతోంది. ముందుగా వాస్తవానికి ఈ సినిమా టైటిల్ శేషాచలం అని పెడదామని అనుకున్నారట, ఎందుకంటే శేషాచలం అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అలా పెట్టాలని భావించిందట యూనిట్. ఆ తర్వాత సినిమాలోని హీరో క్యారెక్టర్ పేరైన పుష్ప రాజ్ ని, సినిమా టైటిల్ గా నిర్ణయిస్తే బాగుంటుందని యూనిట్ ఆలోచించి ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిందట. 

 

కాగా చివర్లో దర్శకుడు సుకుమార్ మరింత ఆలోచన చేసి టైటిల్ ని పుష్పరాజ్ కంటే పుష్ప అయితేనే బాగుంటుందని, ఎందుకంటే గతంలో టాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలకు ఈ విధమైన లేడీ ఓరియంటెడ్ పేర్లు పెట్టి విజయాలు అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ నటించిన లక్ష్మీ, తులసి సినిమాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చని, అలానే వినడానికి కూడా పుష్ప అనే టైటిల్ కొంత పవర్ఫుల్ గా ఉంటుందని భావించి ఫైనల్ గా దాన్నే ఖరారు చేశారట. మొత్తంగా చూసుకుంటే బన్నీ సుకుమార్సినిమా కి పుష్ప టైటిల్ పెట్టడం వెనుక ఇంత చర్చ దాగి ఉందని అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: