ముందుగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి తన తండ్రి శక్తి కపూర్ నటనా వారసత్వంతో హీరోయిన్ గా ఆషికీ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ భామ శ్రద్ధా కపూర్, హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి ఎందరో ప్రేక్షకులను, అభిమానులను తన అందం అభినయంతో కట్టిపడేసింది.ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ మధ్యలో కొన్ని మంచి విజయాలతో దూసుకుపోతున్న శ్రద్ధ, ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధ, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన సినీ, వ్యక్తిగత విషయాలను గురించిన సమాచారాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. 

 

ఇటీవల కరోనా మహమ్మారి నేపథ్యంలో లాకౌట్ ప్రకటించడంతో పాటు సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో, పూర్తిగా ఇంటికే పరిమితమైన శ్రద్ధ, తన బాడీని ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచుకుంటానని, అందుకోసం కొన్ని ట్రిక్స్ పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో తన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటంటే, తరచూ డాన్స్ చేయటం అని, తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టమని, మధ్యలో డాన్స్ చేయడంలో కొంత తప్పులు దొర్లినప్పటికీ కూడా, మెల్లగా మరింతగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని అంటోంది. 

 

అలానే ఈ విధంగా డాన్స్ చేయడం తనకు మంచి ఫిట్ నెస్ ను, ఆరోగ్యాన్ని అందించడంతో పాటు, మానసికంగా కూడా మంచి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అది అందిస్తుందని శ్రద్ధ తన అభిమానులకు తెలియజేయడం జరిగింది. ఈ లాకౌట్ సమయంలో మంచి ఫుడ్ తినడంతో పాటు శరీరాన్ని మనసుని ప్రతిఒక్కరు ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకుంటే లైఫ్ హ్యాపీ గా ఉంటుందని శ్రద్ధ అంటోంది. కాగా శ్రద్ధ పోస్ట్ చేసిన ఆ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.....!!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

So my most favourite way of staying healthy is dancing! Ever since I was a little girl, I just loved to dance! No matter the amount of mistakes (as you will see in this video🙈🤷🏻‍♀️) or the difficulty in steps, dancing makes me so happyyy 😊 #WorldHealthDay P.S: Fortunate to have learned from such incredible dancers & choregraphers. @boscomartis @caesar2373 & the entire amazing team. Thank you guys again & again 🤗 #Chhichhore @niteshtiwari22 💫💜

A post shared by Shraddha (@shraddhakapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: