ఇప్పటికే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు పూర్తిగా తమ ప్రజల నుండి ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మన దేశాన్ని కూడా ఈ నెల 14 వరకు మొత్తంగా 21 రోజుల పాటు లాకౌట్  చేస్తున్నట్లు, అలానే ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ముందుగా ప్రజలందరూ కూడా ఎవరికి వారు సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటిస్తే అతి త్వరలోనే ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని ప్రధాని అన్నారు. 

 

అలానే ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, మరీ ముఖ్యంగా రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు తమ చేతులను సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్ తో గాని తరచూ మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలని, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన చేతిని మోచేతి వరకు గట్టిగా అడ్డం పెట్టుకోవాలని, అదే సమయంలో టిష్యూ పేపర్ వాడి దానిని చెత్తబుట్టలో పారేయాలని అన్నారు. ఇక మరీ ముఖ్యంగా ముఖానికి మాస్కు తప్పనిసరిగా కట్టుకోవాలని, అలానే తమ ఇంటిని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకొని జాగ్రత్తగా ఉండాలని పలువురు అధికారులు, డాక్టర్లు సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే ఎంతలా జాగ్రత్త వహించి ప్రభుత్వం లాకౌట్ ప్రకటించినప్పటికీ కూడా అక్కడక్కడా మధ్యలో కొన్ని చోట్ల ప్రజలు బయటకు వస్తూ ఉండటం తోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పెద్దగా పాటించకపోవడం వంటివి చేస్తున్నారు. 

 

ఈ విధంగా చేయడం వలన కరోనా వ్యాప్తికి మనం మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, దయ చేసి ప్రజలు అందరూ సహకరించాలని పలువురు సెలబ్రిటీలు సైతం సమ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇకపోతే నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో ముఖానికి కట్టుకునే మాస్కుల విషయమై ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ రాశి కన్నా. ముఖ్యంగా మన ముఖానికి హ్యాండ్ కర్చీఫ్ లు, టవల్స్, చున్నీలు వంటివి కట్టుకోవటం కంటే కూడా ఎవరికి వారు తమ ఇంట్లోనే సొంతంగా మాస్కులు తయారు చేసుకొని ముఖానికి పెట్టుకుంటే మంచిదని, మనం పైన చెప్పుకున్న వాటన్నికంటే కూడా మాస్కులు ఈ వ్యాధి నిరోధకానికి మరింత శక్తివంతంగా ఉపయోగపడతాయని రాశి తన పోస్టులో తెలపడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: